Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్

ఈ సోషల్ ఫీచర్ ఇప్పటివరకు స్పోటిఫై డెస్క్‌టాప్ వెర్షన్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐ ఫోన్లపై కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్

Spotify

Spotify: ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్పోటిఫై’ త్వరలో కమ్యూనిటీ అనే సరికొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. ఇదో సోషల్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఈ సోషల్ ఫీచర్ ఇప్పటివరకు స్పోటిఫై డెస్క్‌టాప్ వెర్షన్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐ ఫోన్లపై కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అయితే, యూజర్లు ఆ వివరాల్ని పబ్లిక్‌గా పంచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్ ఇతరులు వినియోగించుకోవచ్చు.

Agniveer: అగ్నివీర్‌లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న

ఈ ఫీచర్ ద్వారా ఫ్రెండ్స్ ప్లే లిస్ట్ అప్‌డేట్ చేసుకున్నా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎక్కువగా వింటున్న ప్లే లిస్ట్ ఏంటి? ఏ పాటలు యాడ్ చేశారు? ఏ పాటలు తీసేశారు? ఎక్కువగా వినే మ్యూజిక్ ఏంటి? అనే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ కావాలని యూజర్లు ఎప్పటినుంచో అడుగుతున్నారు. స్పోటిఫైలో ఉన్న సోషల్ ఫీచర్స్ వల్ల దీన్ని సోషల్ యాప్ ఫర్ మ్యూజిక్ అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రానప్పటికీ, ఐ ఫోన్ యూజర్లు సఫారీ బ్రౌజర్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. సఫారి బ్రౌజర్‌లో ‘స్పోటిఫై కమ్యూనిటీ’ అని టైప్ చేసి, ఈ ఫీచర్ వాడుకోవచ్చు.