Electricity In Telangana : విద్యుత్‌కు ఫుల్ డిమాండ్.. ఏం ఇబ్బంది లేదంటున్న అధికారులు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో.. ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు...

Current
Full Demand For Electricity : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యే సరికి ఎండకాస్త మరింత పెరుగుతోంది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు నడినెత్తిన ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఏప్రిల్ రాకముందే ఎండాలు ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటోయనని ప్రజలు భయపడుతున్నారు. ఎండల నుంచి తప్పించుకొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక ఇంట్లో ఉండే వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి నిర్విరామంగా ఫ్యాన్లు, కూలర్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కరెంటుకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది.
Read More : Summer : వామ్మో ఎండలు.. మార్చిలోనే మాడు పగులుతోంది
ఎండలు మండుతుండటంతో.. తెలంగాణలో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2022, మార్చి 26వ తేదీ శనివారం ఒక్కరోజే.. 13 వేల 742 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాలకు.. తెలంగాణలో 13 వేల 742 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఇదే అత్యధిక పవర్ డిమాండ్. అయితే.. పీక్ డిమాండ్‌ను విద్యుత్ సంస్థలు అధిగమించినట్లు ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.
Read More : Canada Heat Busts : మండిపోతున్న ఎండలు, భరించలేని వేడి… 500మంది మృతి
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో.. ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో.. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం హై లెవల్‌కు చేరింది. గత ఏడాది గ్రేటర్‌లో 55 మిలియన్ యూనిట్స్ దాటని విద్యుత్ వినియోగం.. ఈసారి మార్చిలోనే 65 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. మార్చిలోనే ఇలా ఉంటే.. ముందు ముందు విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే.. పదిహేను వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు.