Garlic : వెల్లుల్లి..ఔషద గుణాల కల్పవల్లి

గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వెల్లుల్లి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Garlic : వెల్లుల్లి..ఔషద గుణాల కల్పవల్లి

Garlic

Garlic : వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అందుకే మన ధైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారంలో భాగమైపోయింది. ఆకలి కలిగించే గుణంతోపాటు, ఔషద లక్షణాలు కలిగిఉండటంతో పురాతన కాలం నుండి దీనిని ఎక్కవగా ఉపయోగిస్తూ వస్తున్నారు. 100 గ్రాముల వెల్లుల్లిలో 58.6గ్రాముల నీరు, 2గ్రాముల ఫైబర్, 6.4గ్రాముల ప్రొటీన్, 181 గ్రాముల కాల్షియం, 100 గ్రాముల శక్తి, 149 గ్రాముల కేలరీలు ఉంటాయి.

గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వెల్లుల్లి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ స్ధాయిలను సమతుల్యం చేసే గుణం కలిగి ఉంటుంది. రక్తం గడ్డకట్టే గుణం తగ్గించి కండరాల పటుత్వాన్ని పెంచుతుంది. కురుపులు , పుండ్లు వంటి వాటిని నిరోధించేందుకు, చక్కెర వ్యాధికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ప్లమెటరీ లక్షణాలు శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి.

ప్రధానంగా శ్వాస సంబంధింత ఇబ్బందులతో బాధపడేవారు వెల్లుల్లి వాడటం ద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. నోటిపూత, దంత సమస్యలు, చిగుళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో సహజంగా వెలుబడే అల్సిన్ వంటి పదార్ధం క్రిములను నాశనం చేసేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజు వారి ఆహారంలో మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను బాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.