Goa BJP : గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ!

గోవాలో మొత్తం 40 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... 21 స్థానాలు సాధించాల్స ఉంటుంది. ప్రస్తుతం 08 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి.. మరో 10 స్థానాల్లో

Goa BJP : గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ!

Goa Results

Goa BJP Leaders To Meet Governor : గోవా రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్ర గవర్నర్ ను కోరనుంది. అయితే.. స్పష్టమైన మెజార్టీకి కొద్దిదూరంలో ఆగిపోయింది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తమకు ఉందని వెల్లడిస్తోంది. ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు బీజేపీ వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వనున్నారని పేర్కొంటోంది. కాంగ్రెస్ రెండోస్థానంలో కొనసాగుతోంది. పార్టీకి చెందిన అభ్యర్థులు చేజారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటోంది. వారిని రిసార్ట్ కు తరలించినట్లు సమాచారం.

Read More : గోవాలో గెలుపుకు దగ్గరగా బీజేపీ

గోవాలో మొత్తం 40 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే… 21 స్థానాలు సాధించాల్స ఉంటుంది. ప్రస్తుతం 08 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి.. మరో 10 స్థానాల్లో అధిక్యం దిశగా ముందుకెళుతోంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. వీరి మద్దతు కోరనున్నామని, అలాగే ఎంజీపీ (మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ) మద్దతిచ్చే అవకాశం ఉందని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ పార్టీ మూడు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా, తృణమూల్ కూటమి 3 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. మరి బీజేపీ అనుకుంటున్నట్లుగా మద్దతు ఇస్తారా ? లేదా ? ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? అనేది చూడాలి.