Akhanda: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా అఖండ?

బోయపాటి.. బాలయ్య కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది హైవోల్టేజ్ యాక్షన్ మాత్రమే. సింహ, లెజెండ్ ఇప్పుడు అఖండ.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునే చెప్పేశారు.

Akhanda: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా అఖండ?

Akhanda

Akhanda: బోయపాటి.. బాలయ్య కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది హైవోల్టేజ్ యాక్షన్ మాత్రమే. సింహ, లెజెండ్ ఇప్పుడు అఖండ.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునే చెప్పేశారు. అందుకు తగ్గట్లే పోస్టర్స్ నుండి టీజర్స్ వరకు బోయపాటి ఎక్కడా తగ్గకుండా ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేశాడు. ఫలితంగా టీజర్ యూట్యూబ్లో రికార్డుల వ్యూస్ కొల్లగొట్టింది.

అఖండ సినిమా టీజర్ కి 50 మిలియన్ల వ్యూస్ రావడంతో బాలయ్య అభిమానులు అప్పటి నుండే యమా ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఉన్నారు. కాగా.. త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారట. దసరా కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఈ సినిమా ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ జరుకోవాల్సి ఉండగా కరోనా కాస్త రిలీఫ్ కాగానే షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

బాలయ్యకి జోడిగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే యాక్షన్ ఉండాలని బాలయ్య అభిమానులు బలంగా కోరుకుంటారు. అందుకే ఈ సినిమా యాక్షన్ విషయంలో రామ్ లక్ష్మణ్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దారని చెప్తున్నారు. మరి ఈ యాక్షన్, బీబీ3 కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలంటే దసరా వరకు ఆగాల్సిందే!