Hot Summer : హమ్మయ్య.. శాంతించిన సూర్యుడు.. దేశంలో తగ్గిన ఎండలు, వడగాలులు

హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.

Hot Summer : హమ్మయ్య.. శాంతించిన సూర్యుడు.. దేశంలో తగ్గిన ఎండలు, వడగాలులు

Hot Summer : ఎట్టకేలకు సూర్యుడు శాంతించాడు. ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వేడిగాలులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఏప్రిల్ చివరి వారం, మే మొదటి వారం భానుడు వీర ప్రతాపం చూపించాడు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వెళితే వడదెబ్బ.. దీంతో ప్రజలు ఎండలకు వేగలేక తల్లిడిల్లిపోయారు. కానీ, మొన్న వర్షాలు పడినప్పటి నుంచి సూర్యుడు శాంతించాడు. హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ ప్రజలకు హీట్ వేవ్ నుంచి ఉపశమనం లేదని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయంది. ఉత్తర, తూర్పు భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే కొన్ని కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడివా, జార్ఖండ్ రాష్ట్రాలలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read : మరో 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..! ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్