బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

మరొకసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా లాగా మన దేశం తయారు అవుతుందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

Uttam Kumar Reddy Slams PM Modi: పార్లమెంట్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని.. మరొకసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా లాగా మన దేశం తయారు అవుతుందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో మీట్ ది ప్రెస్‌ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండదని అన్నారు.

”స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పార్లమెంట్‌లో ఎక్కువ మంది ఎంపీలను సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వం. చట్టసభల్లో బిల్లుల మీద కనీసం చర్చ కూడా చేయరు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ కేసులతో బెదిరిస్తారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. Mspకి చట్ట బద్దత కల్పిస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఇవ్వలేదు.

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ స్కీం కింద ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు. అగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదు. ప్రధానమంత్రిగా మోదీ దిగజారి మాట్లాడుతున్నారు. దేశాన్ని ఎలా విభజించాలా అని బీజేపీ ఆలోచన చేస్తోంది. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రయివేట్ దళారీలకు అమ్మింది.

పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. BRS త్వరలోనే vrs తీసుకుంటుంది. తెలంగాణలో
ఇరిగేషన్‌ను సర్వ నాశనం చేసింది కేసీఆరే. కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాల”ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: ఏడాదిలోపు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే: ఎర్రబెల్లి