Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట

ఓయూ సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన క్రిశాంక్ పై పోలీసులు కేసు నమోదు..

Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట

BRS Leader Krishank

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఓయూ సర్క్యులర్‌ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన క్రిశాంక్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు.. రూ.25 వేల రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతిరోజు పోలీసుల ముందు హాజరుకావాలని చెప్పింది.

క్రిశాంక్‌ను కొన్ని రోజుల క్రితం పోలీసులు పంతంగి చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశారు. క్రిశాంక్ కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన ఓయూ వీసీ పేరుతో ఓ ఫేక్ లెటర్‌ సృష్టించినట్లు పీస్‌లో క్రిశాంక్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

నీళ్లు, విద్యుత్ కొరతతో హాస్టల్స్‌ను మూసివేస్తున్నట్లు సర్క్యులర్‌ జారీ అయినట్లు ఫేక్ పత్రాన్ని సృష్టించారని వారు తెలిపారు. దాన్ని పోలీసులు కూడా ఫేక్‌ సర్క్యులర్ గా గుర్తించారు. కాంగ్రెస్ సర్కారుని బదనాం చేసే క్రమంలో ఈ సర్కులర్‌ రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు.

Also Read: బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్