Pinterest పోటీగా : గూగుల్ నుంచి ‘Keen’ కొత్త యాప్ వచ్చేసింది!

  • Published By: srihari ,Published On : June 19, 2020 / 03:58 PM IST
Pinterest పోటీగా : గూగుల్ నుంచి ‘Keen’ కొత్త యాప్ వచ్చేసింది!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త యాప్ వచ్చేసింది. Pinterest యాప్ కు పోటీగా గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో Keen పేరుతో యాప్ ప్రవేశపెట్టినట్టు గూగుల్ Area 120 Team ఒక ప్రకటనలో వెల్లడించింది. వెబ్ వెర్షన్, యాండ్రాయిడ్ వెర్షన్ లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. ఆన్ లైన్ ఫీడ్ లను బ్రౌజ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయంగా ఉండాలని Kenn యాప్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సహా వ్యవస్థాపకుడు CJ Adams తెలిపారు.  

‘Keenలో ఎక్కువ సమయం గడపాలని భావిస్తే.. వెబ్ నుంచి వ్యక్తుల కంటెంట్‌ను క్యూరేట్ చేయాలని ఆడమ్స్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మీరు ఇష్టపడే కంటెంట్‌ను క్యూరేట్ చేయడానికి, మీ రీసెర్చ్ చేసిన సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకోవడానికి మీరు సేవ్ చేసిన వాటి ఆధారంగా కొత్త కంటెంట్‌ను గుర్తించడానికి Kenn యాప్ అనుమతిస్తుంది.

మీరు బ్రౌజ్ చేసే ప్రతి సోషల్ మీడియా ఫీడ్ కంటెంట్‌ను మీ ఇష్టానికి తగినట్టుగా లేదా మరొక విధంగా వ్యక్తికరించవచ్చు. Pinterest ఇప్పటికే ఈ మార్కెట్ లో పాపులర్ అయింది. పిన్‌బోర్డ్-స్టయిల్ విజువల్ డిజైన్ స్వాధీనం చేసుకుంది. కీన్ యాప్‌లోని రెండు ఫీచర్లు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి.