Pakka Commercial: షూటింగ్ ముగించుకున్న పక్కా కమర్షియల్!
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా, సక్సెస్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను....

Gopichand Pakka Commercial Movie Wraps Up Shoot
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా, సక్సెస్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుండటంతో, ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను కూడా మారుతి తనదైన స్టయిల్‌లో పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.
Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్లు ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ముగించుకుంది. చాలారోజులగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ముగించుకోవడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. సెట్స్‌లో చివరిరోజు కావడంతో, చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
Pakka Commercial: ‘పక్కా కమర్షియల్’ మూవీ ప్రెస్ మీట్ ఫోటోలు
ఇక పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా, అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను UV క్రియేషన్స్, GA2 మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, జూన్ 12న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరి పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Macho star @YoursGopichand & Blockbuster @DirectorMaruthi ‘s #PakkaCommercial Shoot Wrapped up!✨#PakkaCommercialTrailer Releasing on June 12th! ?#AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official #PakkaCommercialOnJuly1st ? pic.twitter.com/0lcQ6jGSTJ
— UV Creations (@UV_Creations) June 10, 2022