Green Gram Varieties : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి
పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం. జులై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.

Green Gram Varieties
Green Gram Varieties : ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే పంట పెసర . ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . ఖరీఫ్ రుతుపనాలు ఆలస్యం కావడం, ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పెసరను సాగుచేస్తే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు.
READ ALSO : Intercropping : అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం, చీడపీడల నుండి పంటకు రక్షణ
పెసరను జులై 15 వరకు విత్తుకునే అవకాశముంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనువైన పెసర రకాలను ఎంచుకోవాలంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. సంద్యా కిశోర్.
పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తున్నారు. అంతే కాదు ఏకపంటగాను, అంతర పంటగాను సాగుచేసుకునే వెసులు బాటు ఉంది. ప్రస్తుతం రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఖరీఫ్ లో పంటలకు ఆలస్యమవుతోంది.
READ ALSO : Cotton Crop : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తిసాగు.. తొలిదశలోనే కలుపు నివారించాలంటున్న శాస్త్రవేత్తలు
ఈ పరిస్థితుల్లో స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం. జులై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. ఖరీప్ కు అధిక దిగుబడులను ఇచ్చే అనువైన పలు రకాల గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. సంధ్యా కిశోర్.