Guinness Record: వయసు 12 ఏళ్ళు.. ఐస్ పుల్లలతో 20 అడుగుల టవర్ కట్టేశాడు!

సహజంగా 12 ఏళ్ల కుర్రాడంటే ఆటలు, పాటలతో పాటు చదువు మాత్రమే తెలుసు. కానీ ఆ వయసులో ఆడుకుంటూనే పనికిరాని పుల్లలతో ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులో పేరు లిఖించుకోవడం అంటే సాధారణ విషయమేమీ కాదు.

Guinness Record: వయసు 12 ఏళ్ళు.. ఐస్ పుల్లలతో 20 అడుగుల టవర్ కట్టేశాడు!

Guinness Record

Guinness Record: సహజంగా 12 ఏళ్ల కుర్రాడంటే ఆటలు, పాటలతో పాటు చదువు మాత్రమే తెలుసు. కానీ ఆ వయసులో ఆడుకుంటూనే పనికిరాని పుల్లలతో ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులో పేరు లిఖించుకోవడం అంటే సాధారణ విషయమేమీ కాదు. ఎరిక్ క్లాబెల్ అనే అమెరికా కుర్రాడు మాత్రం మనసుంటే కళకు మార్గం ఉంటుందని నిరూపించాడు. పనికిరాని ఐస్ పుల్లలను ఉపయోగించి ఏకంగా 6.157 మీటర్ల (20.2 అడుగులు) ఎత్తయిన టవర్‌ను నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరు రాసుకున్నాడు.

ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నెపర్వీల్లేకు చెందిన ఎరిక్ క్లాబెల్ అనే కుర్రాడు దాదాపు నెల రోజుల పాటు శ్రమించి ఐసు పుల్లలను (popsicle sticks) ఉపయోగించి ఏకంగా 20 అడుగుల ఎత్తయిన టవర్‌ను నిర్మించాడు. ఈ నిర్మాణంలో మొత్తం 1750 ఐసు పుల్లలను ఉపయోగించగా రెండు పౌండ్ల (దాదాపు కేజీ) బరువుండే గమ్‌ను వాడినట్లుగా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఐస్ పుల్లల లాంటి వస్తువులతో ఎత్తయిన టవర్‌ను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఎరిక్ తండ్రి కూడా ఐసు పుల్లలతో ఇలాంటి అద్భుతాలు సృష్టించేవాడట. అది చూసే నేర్చుకున్న ఎరిక్ 2015 నుంచి ఐసు పుల్లలు, రీసైక్లింగ్ మెటీరియల్స్‌తో వస్తువులను నిర్మించడం ప్రారంభించాడు. ఎప్పటికైనా తాను కూడా గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవాలని భావించిన ఎరిక్ తక్కువ కాలంలోనే ఇలా టవర్ ను నిర్మించి గిన్నిస్ లో స్థానం దక్కించుకున్నాడు. గాలి కొడితేనే పడిపోయే తేలికైన ఐస్ పుల్లలతో టవర్ నిర్మించడం కష్టంతో కూడుకున్నదని, అది బలంగా ఉండేందుకు ఎరిక్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడని గిన్నీస్ అభిప్రాయపడింది.