శిరీషతో ప్రేమలో మిస్టర్ సైలెన్సర్.. ఆకట్టుకుంటున్న ‘గువ్వ గోరింక’ ట్రైలర్..

  • Edited By: sekhar , December 12, 2020 / 02:56 PM IST
శిరీషతో ప్రేమలో మిస్టర్ సైలెన్సర్.. ఆకట్టుకుంటున్న ‘గువ్వ గోరింక’ ట్రైలర్..
ad

Guvva Gorinka Trailer: సత్య దేవ్, ప్రియా లాల్, ప్రియదర్శి ప్రధాన పాత్ర ధారులుగా, రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘సర్కార్’ నుండి ‘రక్తచరిత్ర’ వరకు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి దర్శకత్వంలో, జీవన్, దాము సంయుక్తంగా నిర్మించిన సినిమా.. ‘గువ్వ గోరింక’.. శనివారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

‘‘శిరీష.. సంగీతమే సర్వస్వం అనుకునే అమ్మాయి..  సదానంద్.. చిన్న సౌండ్ వినబడ్డా భూకంపం వచ్చినవాడిలా ఉలిక్కిపడతాడు.. సంగీతమే ప్రాణమైన శిరీషకి, సౌండ్ అంటేనే పడని సదానంద్‌కి.. ఇష్టాయిష్టాలు వేరైనా.. ‘గువ్వ గోరింక’ల్లాంటి ఇద్దరి కథ’’.. అంటూ క్లుప్తంగా సినిమా ఎలా ఉండబోతుందో చూపించారు.

సత్యదేవ్ మరోసారి తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోనున్నాడు. శిరీష, సదానంద్‌ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. ప్రియదర్శి కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ‘గువ్వ గోరింక’ డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్‌ ద్వారా రిలీజ్ అవుతుంది.