Abhay Ram : హ్యాపీ బర్త్‌డే నందమూరి అభయ్ రామ్..

గురువారం (జూలై 22) ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు..

Abhay Ram : హ్యాపీ బర్త్‌డే నందమూరి అభయ్ రామ్..

Abhay Ram

Updated On : July 22, 2021 / 1:54 PM IST

Abhay Ram: యంగ్ టైగర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి దంపతుల కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్‌‌ల పిక్స్ సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ భలే వైరల్ చేస్తుంటారు. ఇక వారి బర్త్‌డే వచ్చిందంటే హంగామా మామూలుగా ఉండదు.

Ntr Family

గురువారం (జూలై 22) ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడి ముద్దుల తనయుడుకి అభిమానులు విషెష్ చెబుతూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అభయ్ రామ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.

అభయ్ రామ్‌కి నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, సినీ ఇండస్ట్రీ వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తారక్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. తర్వాత కొరటాల శివ, ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మూవీస్ కమిట్ అయ్యారు.