Bilingual Movies : తెలుగు-తమిళ్.. బైలింగ్వల్ సినిమాలకి ఓకే చెప్తున్న హీరోలు..

ఒకేసారి రెండు భాషల్లో సినిమా చేయడంతో నిర్మాణ ఖర్చులు తగ్గించి, రెండు భాషల్లో డైరెక్ట్ సినిమాగా రిలీజ్ చేయొచ్చు. రెండు భాషల్లో ఆదాయం పొందొచ్చు. సేమ్ లొకేషన్, సేమ్ ఆర్టిస్టులు, సేమ్ స్టోరీతో బైలింగ్వల్ సినిమాలు చేసి..............................

Bilingual Movies :  తెలుగు-తమిళ్.. బైలింగ్వల్ సినిమాలకి ఓకే చెప్తున్న హీరోలు..

The Warrior

Bilingual Movies :  ఒకేసారి రెండు భాషల్లో సినిమా చేయడంతో నిర్మాణ ఖర్చులు తగ్గించి, రెండు భాషల్లో డైరెక్ట్ సినిమాగా రిలీజ్ చేయొచ్చు. రెండు భాషల్లో ఆదాయం పొందొచ్చు. సేమ్ లొకేషన్, సేమ్ ఆర్టిస్టులు, సేమ్ స్టోరీతో బైలింగ్వల్ సినిమాలు చేసి, సేఫ్ జోన్ లోకి వెళ్లొచ్చు. ఇదీ ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్ల ఆలోచన. విజయ్ వారసుడుతో మొదలు పెట్టి, రామ్ వారియర్ వరకు ఇప్పుడు అన్ని అలాంటి సినిమాలే.

ఈమధ్య కాలంలో బైలింగ్వల్ మూవీస్ ట్రెండ్ పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ రజనీకాంత్, కమలహాసన్, చియాన్ విక్రమ్, సూర్య, లాంటి స్టార్స్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. వాళ్ల తరహాలోనే తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి విజయ్ చేస్తున్న ప్రయత్నం వారసుడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ ‘వరిసు’ తెలుగులో వారసుడుగా వస్తోంది. ఈ సినిమాలో తలపతి విజయ్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Bollywood : 15 ఏళ్ళ తర్వాత అమీర్‌ఖాన్ వర్సెస్ అక్షయ్‌కుమార్

ఇక్కడి స్టార్స్ అక్కడ, అక్కడి స్టార్స్ ఇక్కడ అభిమానులను సంపాధించుకోవడానికి స్టార్స్ బైలింగ్వల్ సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అంతే కాదు, పాన్ ఇండియా రేంజ్ రీచ్ అవ్వడానికి బైలింగ్వల్ సినిమా ఫస్ట్ స్టెప్ గా హెల్ప్ అవుతుందనీ చూస్తున్నారు. ప్రస్తుతం ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తోన్న సార్ సినిమా కూడా బైలింగ్వల్ సినిమానే.

దీంతో పాటు రామ్ పోతినేని లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన బైలింగ్వల్ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయలర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా తమిళ స్టార్ సూర్య చేతుల మీదుగా మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా జులై 14 న రిలీజ్ కానుంది.

Dhanush

 

జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ నటిస్తున్న బైలింగ్వల్ మూవీ ప్రిన్స్. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా నాగ చైతన్య కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు – తమిళ్ సినిమాని అనౌన్స్ చేశారు.

Pawan Kalyan : విశ్వక్ సేన్ సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..

మరికొంత మంది తమిళ, తెలుగు స్టార్స్ డైరెక్టర్స్ పరస్పర సహకారంతో బైలింగ్వల్ సినిమాలు చేస్తున్నారు. నేటివిటీని మిస్ కాకుండా ఒకేసారి రెండు భాషల్లో మేకింగ్ చేసి, రెండు భాషల్లో రిలీజ్ చేసి, ఆదాయాన్నిపెంచుకునే ఎత్తుగడతో డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ బైలింగ్వల్ మూవీస్ చేస్తుంటే, అభిమానులను పెంచుకుని, మార్కెట్ విస్తరించుకునేందుకు ద్విభాషా చిత్రాల బాట పడుతున్నారు హీరోలు.