Honda Activa Hybrid Scooter : ఈ హోండా యాక్టివా ‘హైబ్రిడ్ స్కూటర్..’ పెట్రోల్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌తో నడుస్తుంది!

భారత మార్కెట్లో అత్యంత పాపులర్ స్కూటర్ (Honda Activa) హోండా యాక్టివా. మార్కెట్లో వచ్చిన ఈ స్కూటర్ కిక్ స్టార్టెడ్ వెహికల్.. అలాగే గేర్లు కూడా ఉండవు. అయినప్పటికీ ఈ యాక్టివా స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది మార్కెట్లో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి.

Honda Activa Hybrid Scooter : ఈ హోండా యాక్టివా ‘హైబ్రిడ్ స్కూటర్..’ పెట్రోల్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌తో నడుస్తుంది!

Honda Activa Modified Into A Petrol Electric Hybrid Scooter

Honda Activa Hybrid Scooter : భారత మార్కెట్లో అత్యంత పాపులర్ స్కూటర్ (Honda Activa) హోండా యాక్టివా. మార్కెట్లో వచ్చిన ఈ స్కూటర్ కిక్ స్టార్టెడ్ వెహికల్.. అలాగే గేర్లు కూడా ఉండవు. అయినప్పటికీ ఈ యాక్టివా స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది మార్కెట్లో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. దాంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. అందుకే చాలామంది ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు వాహనదారులు. ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చూస్తే.. ఒక హోండా యాక్టివా స్కూటర్ ను హైబ్రిడ్ గా మార్చేశారు. ఈ వీడియోను LUCKY ELECTRONICS LAB లో అప్ లోడ్ చేశారు. ఈ హైబ్రిడ్ స్కూటర్ పెట్రోల్ తో నడుస్తుంది.. ఎలక్ట్రిక్ బైకులా దూసుకెళ్తుంది.

పెట్రోల్ ఇంజిన్.. ఎలక్ట్రిక్ బ్యాటరీ :

ఇంటర్నల్ గా ఇంజిన్ లో రెండు రకాలుగా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా అమర్చారు. ఛార్జింగ్ చేసేందుకు కుడి కిందిభాగంలో ఒక హుక్ అమర్చారు. బ్యాటరీని మాత్రం సీట్ స్టోరీజీ కిందిభాగంలో అమర్చారు. బ్యాటరీ కుడివైపు భాగంలో MCB ఇన్ స్టాల్ చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బ్యాటరీని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 48 వోల్ట్, 60 వోల్ట్, 72 వోల్ట్ వేగంతో నడుస్తుంది. వోల్టోజ్ స్పీడ్ ఆధారంగా స్కూటర్ స్పీడ్ పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు. 60 Volt లేదా 70 Volt స్పీడ్‌తో పోలిస్తే.. 48 Volt స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. హైబ్రిడ్ స్కూటర్ యజమాని కూడా 48Volt స్పీడ్ మాత్రమే వాడుతున్నారు. ఈ స్పీడ్ తో వెళ్లే స్కూటర్ 40kmph వేగాన్ని అందించగలదు. అదే 72 వోల్డ్ అయితే 60kmph వరకు అందించగలదు. పెట్రోల్ తో స్కూటర్ నడవాలా లేదా ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడవాలంటే ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ద్వారా రెండింటిలో ఏదైనా ఒకటి చేంజ్ చేసుకోవచ్చు.

ఈ స్కూటర్‌లో ఒక సమస్య ఉందట..

ఇంజిన్ రన్ కానప్పుడు స్కూటర్ హెడ్ లైట్స్ పనిచేయడం లేదట.. అందుకోసం అదనంగా ఒక ల్యాంప్ సెట్ చేశాడు. దీనికోసం ఒక స్విచ్ కూడా అమర్చాడు. ఎలక్ట్రిక్ మోడ్ లో ఉన్నప్పుడు స్కూటర్ రివర్స్ రన్ చేయొచ్చు. పార్కింగ్ సమయంలో ఈ మోడ్ ఆపరేట్ చేసుకోవచ్చు. బ్యాటరీ కారణంగా ఈ స్కూటర్ చాలా బరువుగా ఉంటుంది. పక్కకు జరపాలంటే కష్టమని దీనికి రివర్సింగ్ సిస్టమ్ సెట్ చేశారట. ఇక ఎలక్ట్రిక్ మోటార్ రియర్ టైర్ పై ఇన్ స్టాల్ చేశారు. రియర్ టైర్ ఉంటేనే స్కూటర్ నుంచి హైబ్రిడ్ లోకి మార్చడం సాధ్యపడుతుంది. రియర్ టైరులో ట్యూబ్ ఉండదు. ఫిక్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.

ఒకవేళ పై ఎత్తుకు ఎక్కించాలంటే మాత్రం పెట్రోల్ ఇంజిన్ వాడాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ వాటర్ ప్రూఫ్ తో వచ్చింది. ఇందులో కిట్ కూడా ఉంది. ఈ కిట్ Honda Aviator, Cliq, Dio, Grazia and Navi సపోర్ట్ చేసేలా ఉంటుంది. అంతేకాదు.. ఇతర స్కూటర్లలో Hero వంటి Maestro, Pleasure, Destini, Duet వాహనాలకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 30Nm పీక్ టార్క్ తోపాటు 1.5kW పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ స్కూటర్ 48 వోల్ట్ సామర్థ్యంతో 50 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది. దీని ధర రూ.50వేల వరకు ఉంటుంది. ఇక బ్యాటరీ లైఫ్ కనీసం 3 ఏళ్ల వరకు పనిచేస్తుంది.