Metroman Quits Politics : పాలిటిక్స్ కు మెట్రోమ్యాన్ గుడ్ బై

మెట్రోమ్యాన్ గా పేరుపొందిన శ్రీధరన్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీథరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Metroman Quits Politics : పాలిటిక్స్ కు మెట్రోమ్యాన్ గుడ్ బై

Metroman (1)

Updated On : December 16, 2021 / 4:26 PM IST

Metroman Quits Politics : మెట్రోమ్యాన్ గా పేరుపొందిన శ్రీధరన్ పాలిటిక్స్ కు  గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీథరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ సీఎం అభ్యర్థిగా కూడా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాల‌క్క‌డ్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన శ్రీధరన్.. ఓట‌మి పాల‌య్యారు. పాల‌క్క‌డ్ ఓట‌మి త‌ర్వాత శ్రీధ‌ర‌న్ సైలెంట్ అయిపోయారు. క్రమంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన శ్రీధరన్ గురువారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను క్రియాశీల రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్నాన‌ని శ్రీధరన్ ప్రకటించారు.

మలప్పురంలోని తన స్వగ్రామంలో శ్రీధరన్ మీడియాతో మాట్లాడుతూ…”చాలా మందికి తెలియదు, నా వయస్సు ఇప్పుడు 90 సంవత్సరాలు. ఇంకా రాజకీయాల్లో ఉండ‌డం, రాజ‌కీయాల‌ను కెరీర్‌గా కొన‌సాగిస్తే చాలా ప్ర‌మాదం. నేను క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను. దీనర్థం నేను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నాను అని కాదు. నేను ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, నేను బాధపడ్డాను, కానీ ఇప్పుడు నేను విచారంగా లేను ఎందుకంటే ఒక్క శాసనసభ్యుడితో ఏమీ చేయలేము. నేను బ్యూరోక్రాట్‌ని కాబట్టి నేను ఎప్పుడూ రాజకీయ నాయకుడిని కాదు. నేను రాజకీయాల్లో చురుకుగా ఉండనప్పటికీ, ఎల్లప్పుడూ ప్రజలకు ఇతర మార్గాల్లో సేవ చేయగలను. నాకు మూడు ట్రస్టులు ఉన్నాయి, వాటి ద్వారా ప్రజలకు సేవ చేస్తా”అని శ్రీధరన్ తెలిపారు. బీజేపీకి గత ఎన్నికల్లో రాష్ట్రంలో 16 నుంచి 17 శాతం ఓట్లు పోలయ్యాయని, అయితే ఇప్పుడు అది తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు.

ALSO READ Intermediate Exams Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదల