ICC Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్.. కష్టాల్లో భారత్ 128/8

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు వైరుస వైఫల్యాలతో సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది...

ICC Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్.. కష్టాల్లో భారత్ 128/8

Team India

ICC Women’s World Cup India vs England : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కప్ కొట్టేయాలనే ధృడ సంకల్పంతో బరిలోకి దిగిన భారత జట్టు..మరోపోరుకు రెడీ అయిపోయింది. 2022, మార్చి 16వ తేదీ బుధవారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు వైరుస వైఫల్యాలతో సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.

Read More : ICC Women’s World Cup : ప్రపంచకప్‌‌లో బోణీ కొట్టిన భారత్.. పాక్ పరాజయం, చుక్కలు చూపించిన రాజేశ్వరి

ఇక భారత్ విషయానికి వస్తే.. జరిగిన మూడు మ్యాచ్ ల్లో రెండింట్లో విజయం సాధించి.. మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫస్ట్ మ్యాచ్ లో పాక్ పై ఘనం విజయం సాధించిన భారత్ మహిళల టీం.. రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టులో ఓడిపోయింది. అనంతరం జరిగిన వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉంది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ లు సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కానీ.. ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. 33 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఏ ఒక్కరూ రాణించలేకపోయారు.

Read More : Women’s World Cup 2022 : వెస్టిండీస్‌‌పై భారత్ ఘన విజయం..చెలరేగిన స్మృతి, హర్మన్ ప్రీత్

ఆరు ప్రపంచకప్ లు ఆడిన తొలి క్రికెటర్ గా భారత్ కెప్టెన్ మిథాలీ చరిత్ర సృష్టించనుంది. ఈ టోర్నీలో ఆమె మరో 362 పరుగులు చేస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మహిళగా రికార్డు నమోదు చేయనుంది. అయితే ఆమె విఫలమౌతూ వస్తున్నారు. ఇప్పటి వరకు రెండుసార్లు (2005, 2017) చేరిన భారత్ కప్పు మాత్రం సాధించలేకపోయింది. తొలిసారి విశ్వవిజేతగా నిలిచేందుకు పోరాటం చేస్తోంది. 2017లో ఇంగ్లాడ్ లో జరిగిన ప్రపంచకప్ లో లో అంచనాల్లేకుండా…అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశారు. కెప్టెన్ మిథాలీకి ఇదే ఆఖరి ప్రపంచకప్. దీంతో ప్రపంచకప్ విజయంతో ముగింపు పలకాలని భావిస్తున్నారు.


భారత జట్టు : స్మృతి మంధాన, యాస్తిక భాటియా, మిథిలా రాజ్, దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్, జూలన్ గోస్వామి, మేఘ్ నా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్.