Ice Apple : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు!.
ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారినపడే వారికి తాటి ముంజెలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ ను నివారించటంలో తాటి ముంజలు సహాయపడతాయి.

Ice Apple
Ice Apple : వేసవిలో లభ్యమయ్యే వాటిలో తాటి ముంజెలు ఒకటి. ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషదంగా తాటిముంజలకు పేరు. తాటి ముంజల్లో కొబ్బరి నీటిలాంటి తియ్యని నీరు ఉంటుంది. మండే ఎండల్లో తాజా ముంజెలను తింటే ఎండవేడికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. మండుటెండలో భానుడి తాపాన్ని తట్టుకునేందుకు తాటిముంజలు తినటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవి కాలంలో తాటిముంజలకు మంచి గిరాకీ ఉంటుంది. పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. కిడ్నీలలో స్టోన్స్ రాకుండా చేస్తాయి. ముంజల్లో పుష్కలంగా ఉండే ఫైటోకెమికల్స్ వల్ల వయసు పైబడటంతో కనిపించే లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే క్లాట్స్‌ను ముంజలు నివారిస్తాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితిలో తాటి ముంజెలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి.
గర్భిణీలు తాటి ముంజలు తినడం వల్ల వారిలో మలబద్దక సమస్య నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజెలను తింటె ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, బి , సి ఐరన్ , జింక్ , పాస్ఫరస్ , పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. తాటి ముంజెలలో ఉండే పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.
ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారినపడే వారికి తాటి ముంజెలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ ను నివారించటంలో తాటి ముంజలు సహాయపడతాయి. వీటిని తింటే శక్తి వస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అధిక బరువును నియంత్రణలో ఉంచుతాయి. వేసవిలో మీరు బరువు తగ్గాలనుకుంటే తాటిముంజలు బాగా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే అధిక నీటిశాతం, మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగించి ఆకలి లేకుండా చేస్తుంది. దీని వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము కేన్సర్‌తోపాటు ఇతర కేన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజెల్లో ఉన్నాయి. వేసవిలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ చర్మమీద ఏర్పడే ఒక రకమైనటువంటి చర్మరంధ్రాలను తొలగించవచ్చు. గుండె సమస్యలు ఉన్న వారు, అధిక బరువు ఉన్న వారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పండ్లలో తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది.