IDFC FIRST Bank MD :ఇంటి పనిమనిషితో సహా తన వ్యక్తిగత సిబ్బంది రూ.3.95 కోట్ల విలువైన షేర్లు ఇచ్చేసిన బ్యాంకు CEO

తన కారు డ్రైవర్,ట్రైనర్, ఇంటి పనిమనిషికి రూ.3.95 కోట్ల విలువైన షేర్లు ఇచ్చేసారు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్.

IDFC FIRST Bank MD :ఇంటి పనిమనిషితో సహా తన వ్యక్తిగత సిబ్బంది రూ.3.95 కోట్ల విలువైన షేర్లు ఇచ్చేసిన బ్యాంకు CEO

Idfc First Bank Md V Vaidyanathan Gift

IDFC FIRST Bank MD V Vaidyanathan Gift : శ్రీమంతులు చాలామంది తమ ఇంటిలో తమకోసం 24గంటలు పనిచేసేవారిని కేవలం పనిమనుషులుగా మాత్రమే చూస్తారు. కొద్దిమంది మాత్రమే సొంత మనుషుల్లా చూస్తారు.సొంతమనుషుల్లా చూసిన వారికి ఆస్తులు రాసి ఇవ్వరు. కానీ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ మాత్రం తన కోసం అహర్నిసలు పనిచేసే వారిని సొంత వ్యక్తుల్లా ఏకంగా తన ఆస్తులే రాసి ఇచ్చేశారు. తన కారు డ్రైవర్, తన ఇంటి పనిమనిషి,తన ట్రైనర్ తో సహా ఐదుగురికి రూ. 3.95 కోట్ల విలువైన తన 9 లక్షల షేర్లను ఇచ్చేశారు. ఫిబ్రవరి 21, 2022న తన వద్ద ఉన్న 9,00,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇచ్చారని బ్యాంక్ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

Also read : Trump Truth Social App : ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ యాప్ వచ్చేస్తోంది.. ఆపిల్ App Storeలో రేపే లాంచ్..!

తన ట్రైనర్, ఇంటి పనిమనిషి, కారు డ్రైవర్ సహా ఐదుగురు కేవలం నాకు పనివారు కాదు..వారితో నాకు బంధుత్వం లేదు. కానీ మంచి అనుబంధం ఉంది..అని వైద్యనాథన్ తెలపటం విశేషం. ఆయనతో ఎటువంబి బంధుత్వం లేనివారికి అంత భారీ ఆస్తుల్ని ఇచ్చేయటం వైద్యనాథన్ పెద్ద మనస్సుకు నిదర్శనంగా కనిపిస్తోంది. వైద్యనాథన్ ఇలా షేర్లు ఇవ్వటం మొదటిసారి కాదు..గతంలో కూడా తన వ్యక్తిగత హోదాలో వాటాలను బహుమతిగా కొన్ని షేర్లు ఇచ్చారు.

వైద్యనాథన్ తన 9 లక్షల ఈక్విటీ షేర్లను ఐదుగురికి బహుమానంగా ఇచ్చినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తెలిపింది. 3 లక్షల షేర్లను తన ట్రైనర్ రమేశ్ రాజుకు, ఇంటి పనిచేసే ప్రంజల్ నర్వేకర్, కారు డ్రైవర్ అల్గర్‌స్వామి సి మునపర్‌లకు చెరో 2 లక్షల షేర్లు, ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ అయిన దీపక్ పథారే, ఇంటి పనిమనిషి సంతోష్ జొగాలేకు చెరో లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమానంగా ఇచ్చేశారు.

Also read : Ukraine Crisis: యుక్రెయిన్ నుంచి భారత్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం

నిన్నటి క్లోజింగ్ ధర ప్రకారం బీఎస్ఈలో ఐడీఎఫ్‌సీ షేర్ ఒక్కోటి రూ. 43.90గా ఉంది. ఈ లెక్కన వైద్యనాథన్ బహుమతిగా పంచిపెట్టిన 9 లక్షల షేర్ల విలువ రూ. 3,95,10,000. కాగా, రుక్మిణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు 2 లక్షల షేర్లను ఇచ్చినట్టు ఐడీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. మొత్తంగా 11 లక్షల ఈక్విటీ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్టు బ్యాంకు తెలిపింది. అదనంగా..రుక్మణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక కార్యకలాపాలకు మద్దతుగా 2 లక్షల ఈక్విటీ షేర్లను ఇచ్చిందని బ్యాంక్ తెలిపింది.BSE లో సోమవారం నాటి ముగింపు ధర రూ. 43.90 చొప్పున లెక్కించగా, వైద్యనాథన్ బహుమతిగా ఇచ్చిన 9 లక్షల షేర్ల విలువ రూ.3,95,10,000గా ఉంది.