Ukraine Crisis: యుక్రెయిన్ నుంచి భారత్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం

చదువులు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం యుక్రెయిన్ వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయులు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

Ukraine Crisis: యుక్రెయిన్ నుంచి భారత్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం

Air India

Ukraine Crisis: రష్యా దూకుడుతో యుద్ధ సంక్షభంలో చిక్కుకున్న యుక్రెయిన్ నుండి భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యుక్రెయిన్ పై దాడులు తప్పవంటూ రష్యా హెచ్చరికల నేపథ్యంలో.. అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. యుక్రెయిన్ లోని భారతీయులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలో ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ B-787 విమానం మంగళవారం ఉదయం యుక్రెయిన్ కు బయలుదేరి వెళ్ళింది. యుక్రెయిన్ లోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం బోరిస్పిల్ నుంచి ఈ తరలింపు ప్రక్రియ జరగనుంది.

Also read: Russia-Ukraine : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు

చదువులు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం యుక్రెయిన్ వెళ్లిన దాదాపు 20 వేల మంది భారతీయులు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో దౌత్యసంబంధీకులు మినహా మిగతావారందరు భారత్ కు తరలివెళ్లిపోవాలని కీవ్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు సూచించారు. అదే సమయంలో అంతర్జాతీయంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ విమాన సర్వీసులపై భారతీయ పౌర విమానయాన శాఖ ఆంక్షలు సడలించింది. దీంతో యుక్రెయిన్ బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 22, 24,26 తేదీల్లో ఇండియాకు 3 వందే భారత్ మిషన్ విమాన సర్వీసులు ప్రారంభించింది ఎయిర్ ఇండియా సంస్థ.

Also read: India : యుక్రెయిన్‌కు రష్యా బలగాలను తరలించడంపై భారత్ అభ్యంతరం

ఎయిర్ ఇండియా విమాన టికెట్ల బుకింగ్ కు సంబంధించి బుకింగ్ కార్యాలయాలు, వెబ్‌సైట్, కాల్ సెంటర్, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ తెరవబడుతుందని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈమేరకు 200 సీట్లకు పైగా సామర్ధ్యంగల డ్రీమ్‌లైనర్ B-787 విమానం మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్ళింది. మంగళవారం రాత్రి యుక్రెయిన్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోనుంది. మరోవైపు యుక్రెయిన్ పై దండయాత్రకు సిద్దమైన రష్యాను.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాలంటూ అమెరికా, యూరప్ దేశాల సహాయాన్ని కోరింది యుక్రెయిన్.

Also read: Joe Biden: యుక్రెయిన్‌పై రష్యా దూకుడు.. అమెరికా పెద్ద అడుగు!