Russia-Ukraine : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు

యుక్రెయిన్‌‌ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది.

Russia-Ukraine : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు

Russia Ukraine

Russia-Ukraine border : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు నెలకొన్నాయి. యుక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా వేగంగా అడుగులేస్తోంది. వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా దళాలు చేరుకుంటున్నాయి. డాన్‌బాస్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యాపై యుక్రెయిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదన్న యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ తేల్చిచెప్పారు. అటు రష్యా తీరుపై అమెరికా ఆగ్రహంగా ఉంది. రష్యాపై ఆంక్షలు విధిస్తూ బైడెన్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

యుక్రెయిన్‌ నుంచి ఎంబసీని తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. రాయబార కార్యాలయ సిబ్బందిని పోలాండ్ తరలిస్తోంది అమెరికా. ఇక యుక్రెయిన్ పరిణామాలపై ఐక్యసమితి అత్యవసర సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. రష్యా తీరును అమెరికా అమెరికా, నాటో దేశాలు ఎండగట్టాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలకు అమెరికా, యూకే సిద్ధపడ్డాయి. రష్యా వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్న అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అటు యుక్రెయిన్ నుంచి తమ దేశ ప్రజలను తరలించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లుగా సమాచారం.

India : యుక్రెయిన్‌కు రష్యా బలగాలను తరలించడంపై భారత్ అభ్యంతరం

యుక్రెయిన్‌‌ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది. తూర్పు యుక్రెయిన్‌లో రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు.

డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్టు చెప్పారు పుతిన్‌. చాలా కాలంగా వినిపిస్తున్న ఈ రెండు ప్రాంతాల స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని తక్షణమే గుర్తించడం కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానన్నారు పుతిన్‌. వేర్పాటువాదులతో పరస్పర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై పుతిన్ సంతకం చేశారు.

Joe Biden: యుక్రెయిన్‌పై రష్యా దూకుడు.. అమెరికా పెద్ద అడుగు!

తన నిర్ణయానికి పార్లమెంట్ ఎగువ సభ మద్దుతు ఇవ్వాలని తన ప్రసంగం చివరిలో పుతిన్ కోరారు. ఇక ఈ రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించే బిల్లుపై ఉభయసభల్లో ఇవాళే ఓటింగ్ జరిగే అవకాశముంది. తూర్పు ప్రాంతంలోని రష్యా మద్దతుదారులపై యుక్రెయిన్ సైనిక ఆపరేషన్లను నిలిపివేయాలని వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేశారు. అయితే పుతిన్‌ వ్యాఖ్యలకు విరుద్దంగా రష్యానే యుక్రెయిన్‌పై దాడి చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది.

అటు యుక్రెయిన్‌పై ఏ క్షణంలోనైనా రష్యా దాడికి దిగుతుందని అమెరికా హెచ్చరించింది. తక్షణమే యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీని దేశం వీడాలని కోరింది. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని జాన్‌సన్‌తో మాట్లాడారు. యుక్రెయిన్‌ అధ్యక్షుడు. అటు రష్యా తీరుపై ఐక్యరాజ్యసమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. యుక్రెయిన్‌ సార్వభౌమాధికారంపై రష్యా దాడి చేసిందని ఐక్యరాజ్యసమితి విమర్శలు చేసింది.