Ravichandran Ashwin: డేల్ స్టెయిన్‌ను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్

కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసిన పది రోజులకే.. టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి మరో ఘనత దక్కించుకున్నాడు అశ్విన్. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ అయిన డేల్ స్టెయిన్ ను..

Ravichandran Ashwin: డేల్ స్టెయిన్‌ను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్

Ravi Ashwin

Updated On : March 14, 2022 / 9:53 PM IST

Ravichandran Ashwin: కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసిన పది రోజులకే.. టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి మరో ఘనత దక్కించుకున్నాడు అశ్విన్. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ అయిన డేల్ స్టెయిన్ ను దాటేసి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు టీమిండియా స్పిన్నర్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మూడో రోజు మ్యాచ్ లో ధనంజయ డె సిల్వాను ఓడించి ఈ ఫీట్ సాధించాడు.

దీంతో 440వ వికెట్ పడగొట్టాడు అశ్విన్. 171 ఇన్నింగ్స్ లో డేల్ స్టెయిన్ పేరిట ఉన్న 439వికెట్లు రికార్డును 162 ఇన్నింగ్స్ లలోనే సాధించి ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800టెస్టు వికెట్లతో టాప్ లో ఉండగా ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ 709టెస్టు వికెట్ల రికార్డుతో రిటైర్ అయ్యారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్(డే/నైట్) మ్యాచ్ లోనూ భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 238 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ డే నైట్ టెస్టులో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. 447 పరుగుల భారీ లక్ష్యంతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక.. 59.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Read Also: రోహిత్ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు – రవిచంద్రన్ అశ్విన్