Flipkart Deals: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్.. రూ. 18వేలకే iPhone వచ్చేస్తుంది

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసిన iPhone 13ను యాపిల్ కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. త్వరలో ఐఫోన్ 13 మొబైల్స్ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Flipkart Deals: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్.. రూ. 18వేలకే iPhone వచ్చేస్తుంది

Iphone

Flipkart Curtain Raiser Deals Sale: ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసిన iPhone 13ను యాపిల్ కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. త్వరలో ఐఫోన్ 13 మొబైల్స్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుండగా.. యాపిల్ కంపెనీ ఇతర మోడల్స్ ధరలు (iPhone SE 2020 Price) ఒక్కసారిగా తగ్గించేసింది. ఇటీవల ఐఫోన్ ముందు మోడల్స్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన యాపిల్ కంపెనీ.. తమ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి Flipkart Big Billion Days saleలో మరో శుభవార్త అందించింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2020 మోడల్ (iPhone SE 2020 Price) ధర రూ.39,900 కాగా, బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,999కి తగ్గించింది. ఏకంగా రూ.14000 ధర తగ్గడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా తక్కువ ధరలకు iPhone SE మొబైల్స్ కొనాలంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను వాడుకోవచ్చు కూడా. అక్టోబర్‌ 3 నుంచి 10 జరగనున్న బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌లో ఆపిల్‌ ప్రాడక్ట్‌పై ఈ భారీ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది.

యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ విషయానికి వస్తే, 4.7 అంగుళాలు, రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే, యాంబినెట్‌ లైటింగ్‌, హెచ్‌డీఆర్‌ 10 కాంపర్ట్‌బులిటీతో డాల్బీ విజన్‌,ఆపిల్ ఏ13 బయోనిక్ చిప్‌, యాపిల్‌ ఐఫోన్‌ 11 లైనప్‌, ఏ13 బయోనిక్‌లో సెకను వ్యవధిలో ట్రిలియన్‌ కార్యకాలపాల్ని చేసే సామర్ధ్యం, 8-కోర్ న్యూరల్ ఇంజిన్, సీపీయూలో రెండు మెషిన్ లెర్నింగ్ యాక్సిలరేటర్లతో పాటు కొత్తగా మెషిన్ లెర్నింగ్ కంట్రోలర్లు కూడా ఉన్నాయి. 18వాల్ట్‌ల వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగిస్తే, రూ. 5వేల కంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఫోన్‌లపై రూ.15,000 వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ ఫోన్‌ను బట్టి ఇస్తున్నారు. అదనపు బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.18,499 వరకు తగ్గుతుంది.

ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్‌కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.30,999 ఉండ‌గా, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.40,999గా ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల‌కు చెందిన క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1500 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. కొన్ని ఇత‌ర బ్యాంకులు కూడా ఈ ఫోన్‌పై రూ.1000 వ‌ర‌కు క్యాష్ బ్యాక్‌ ఇస్తున్నట్లు ప్రకటించాయి.