Policybazaar: పాలసీబజార్‌కు రూ.24లక్షల ఫైన్.. ఆ ఎస్మెమ్మెస్‌లే కారణం

పాలసీ అగ్రిగేటర్ పాలసీబజార్ అడ్వర్జైట్మెంట్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసిందని ఇన్సూరెన్స్ సెక్టార్ రెగ్యూలేటర్ (IRDAI) రూ.24లక్షల ఫైన్ వేసింది.

Policybazaar: పాలసీబజార్‌కు రూ.24లక్షల ఫైన్.. ఆ ఎస్మెమ్మెస్‌లే కారణం

Policybazaar

Policybazaar: పాలసీ అగ్రిగేటర్ పాలసీబజార్ అడ్వర్జైట్మెంట్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసిందని ఇన్సూరెన్స్ సెక్టార్ రెగ్యూలేటర్ (IRDAI) రూ.24లక్షల ఫైన్ వేసింది. టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమ్స్ పెంచుతున్నట్లు ఎస్సెమ్మెస్ లతో అడ్వర్టైజ్మెంట్ చేసింది. 2020 మార్చి 15 నుంచి 2020 ఏప్రిల్ 7 మధ్య కాలంలో పూర్తి రిజిష్టర్డ్ నేమ్ తో మెసేజ్ లు పంపింది.

ఈ వెబ్ పోర్ట్ ఎస్మెమ్మెస్ లను 10లక్షల మంది కస్టమర్లకు పంపి లైఫ్ ఇన్సూరెన్స్ రేట్లు ఏప్రిల్ 1నుంచి పెరుగుతున్న తెలిపింది. టెర్మ్ ప్లాన్ కొనుగోలు చేస్తే రూ.1.65లక్షల వరకూ సేఫ్ అవుతాయని అందులో పేర్కొంది. దీనిపై ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మూడు రకాల ఛార్జ్ లు విధించింది.

ఎస్మెమ్మెస్ ల ద్వారా తప్పుదోవ పట్టించి ధరలు పెరుగుతున్నాయని చెప్పడం, రెగ్యూలేషన్ 11, 9ను ఉల్లంఘించి అడ్వర్టైజ్మెంట్ రూల్స్ పాటించకపోవడం.

దీనిపై ఏప్రిల్ 7 నాటికి వివరణ ఇవ్వాలని పాలసీబజార్ ను ఆదేశించింది. దానిపై స్పందించి తమ ఇన్సూరెన్స్ పార్టనర్ల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారమే మెసేజ్ లు చేసినట్లుగా చెప్పింది. HDFC Life, Tata AIA Life, ICICI Prudentialలు ధరలు పెరుగుతాయని వచ్చిన సమాచారం ప్రకారమే మెసేజ్ లు పంపినట్లు తెలిపింది.

ట్రాయ్ రెగ్యూలేషన్ చెప్పినట్లుగానే పాలసీ బజార్ పూర్తి రిజిషర్ట్డ్ నేమ్ కాకుండా కేవలం POLBAZ అని హెడర్ తో పంపినట్లు తెలిపింది. అయినప్పటికీ ఎస్సెమ్మెస్ లు పంపి 10లక్షల వరకూ కస్టమర్లకు ఆందోళన పుట్టించినందుకు గానూ హెచ్చరిస్తూ భవిష్యత్ లో అలాంటివి చేయొద్దని ఆదేశాలిచ్చింది.