Cardiac Tests : కఠినమైన వ్యాయామాలు, క్రీడలకు ముందుగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవటం అవసరమా?

గుండెపోటు రిస్కులుండి హఠాన్మరణం పాలయ్యే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటోంది. హఠాత్తుగా గుండె ఆగి మరణించే వారి సంఖ్యను తగ్గించాలంటే గుండెపోటు రిస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్‌ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది.

Cardiac Tests : కఠినమైన వ్యాయామాలు, క్రీడలకు ముందుగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవటం అవసరమా?

Cardiac Tests : హఠాత్తుగా గుండె ఆగి మరణించటం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే గుండెపోటు ను ముందే గుర్తిస్తే దాని బారినుండి తప్పించుకోవచ్చు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్లు, తీవ్ర గుండె వైఫల్యం ఉన్నవాళ్లు, గుండె నిర్మాణంలో లోపాలున్న వారిలో హఠాత్తుగా ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

వాస్తవానికి చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని తమకుతామే బావిస్తారు.. కానీ పైకి ఏమీ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ గుండె జబ్బు ఉండే అవకాశమూ ఉంటుంది. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం వల్ల అకస్మాత్తుగా దానిబారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రిలో చేరటంపై అవగాహన చాలా అవసరం.

గుండెపోటు రిస్కులుండి హఠాన్మరణం పాలయ్యే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటోంది. హఠాత్తుగా గుండె ఆగి మరణించే వారి సంఖ్యను తగ్గించాలంటే గుండెపోటు రిస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్‌ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. పోలీసు, ఎస్సై వంటి పోస్టులకు జరిపే దేహదారుఢ్య పరీక్షల్లో చాలా దూరాలు పరుగులుపెట్టే కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవటం మనం తరచూ వింటూనే ఉంటాం.

శారీరక దారుఢ్య పరీక్షలకు వెళ్లినప్పుడు అప్పటికే వీరిలో లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ వంటివి ఉంటే ఇలాంటి సమయంలో అవి మరింత సమస్యాత్మకంగా మారి, హఠాత్తుగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు ఆరంభించే ముందు తప్పనిసరిగా ఈసీజీ పరీక్ష తీయించి, సమస్యేమీ లేదని నిర్ధారించుకోవటం మంచిది. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. కొందరు కొంచెం సేపు ఎక్కువ వ్యాయామం చేస్తే కళ్లు తిరిగి పడిపోతుంటారు. వీరు కూడా ఓసారి వైద్యులను సంప్రదించి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవటం మంచిది.