Oscar 2022: ఆస్కార్‌ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్‌!

ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకి మంచి గుర్తింపు ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటికి 25 సినిమాలు వచ్చాయి. వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్ సిరీస్.

Oscar 2022: ఆస్కార్‌ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్‌!

Oscar 2022

Oscar 2022: ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకి మంచి గుర్తింపు ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటికి 25 సినిమాలు వచ్చాయి. వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్ సిరీస్. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా ‘నో టైమ్ టు డై’ టైటిల్‌తో బాండ్ సిరీస్‌లో తాజాగా 25వ సినిమా వచ్చింది. ఈ సినిమాని మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి దాదాపు 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో డైరెక్టర్ జోజీ ఫకునగా ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారు.

Telugu Film Production: అప్ కమింగ్ హీరోలకు లిఫ్ట్ ఇస్తున్న స్టార్ ప్రొడ్యూసర్స్!

వరల్డ్స్ మోస్ట్ అవెయిట్ మూవీ ‘నో టైమ్ టు డై’ సినిమా 30 సెప్టెంబర్‌ 2021న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాగా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటి వరకూ 100 మిలియన్లకు పైగా కలెక్షన్లు సాధించిన నో టైం టూ డై ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. అకాడమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ 94వ ఆస్కార్‌ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది. ఇందులో నాలుగు విభాగాల్లో ‘నో టైమ్‌ టు డై’ చిత్రం నామినేట్‌ అయింది.

S.Thaman: థమన్ మ్యూజిక్ చేసే సినిమాలు.. ఈ పండగకి అప్డేట్స్ లేనట్లేనా?

ఆస్కార్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో నాలుగింటికి ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం. ఆ నాలుగు విభాగాలు.. 1. మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ 2. మ్యూజిక్‌ (ఒరిజినల్‌ స్కోర్‌) 3. మ్యూజిక్‌ (ఒరిజినల్‌ సాంగ్‌-చిత్రం టైటిల్‌ సాంగ్‌) 4. సౌండ్‌. అయితే ఈ నాలుగింటిలో ‘నో టైమ్‌ టు డై’ సినిమా ఎన్ని ఆస్కార్‌లు కొల్లగొడుతుందో చూడాలి.