Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. స్టువర్ట్ బ్రాడ్‌ను మట్టికరిపించి , టెస్ట్ క్రికెట్‌లో సింగిల్ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఫీట్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు.

Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

Bumra

 

 

Jasprit Bumrah: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. స్టువర్ట్ బ్రాడ్‌ను మట్టికరిపించి , టెస్ట్ క్రికెట్‌లో సింగిల్ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఫీట్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు.

18 సంవత్సరాల క్రితం .. 2003-04లో టెస్ట్ మ్యాచ్‌లో లారా టెస్టు మ్యాచ్ లో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ రాబిన్ పీటర్సన్‌ బౌలింగ్ లో 28 పరుగులకు కొట్టాడు. ఇందులో ఆరు లీగల్ డెలివరీలలో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జార్జ్ బెయిలీ కూడా ఒక ఓవర్‌లో 28 పరుగులు చేసినప్పటికీ బౌండరీల లెక్కింపులో లారా కంటే వెనుకబడ్డాడు.

2007లో ప్రారంభ ప్రపంచ T20లో యువరాజ్ సింగ్ వేసిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన బ్రాడ్, ఇక్కడ జరిగిన ఐదో రీషెడ్యూల్ టెస్ట్‌లో భారత తొలి ఇన్నింగ్స్‌లో 84వ ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చాడు. ఆరు అదనపు పరుగులైన 5వైడ్లు ఒక నో-బాల్ ఉన్నాయి.

Read Also: టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు

ప్రస్తుతం.. టీమిండియా కెప్టెన్ 16 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్లాన్ చేసిన దానికి విరుద్ధంగా బంతి బౌండరీకి దూసుకెళ్లడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న బ్రాడ్ మరో ఐదు వైడ్ లు విసిరాడు. అలా నో బాల్ తో కలిపి బుమ్రాకు అదనంగా ఏడు పరుగులు వచ్చాయి.

తర్వాతి మూడు బంతులు ఒకటి మిడ్-ఆన్, ఒకటి ఫైన్ లెగ్, చివరిది మిడ్-వికెట్ వేర్వేరు దిశల్లో బౌండరీలు కొట్టేశాడు.

గాయాలను పట్టించుకోకుండా డీప్ మిడ్ వికెట్‌పై ఒక సిక్స్‌తో చేశాడు. రిషబ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) సెంచరీలతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 416 పరుగుల వద్ద ముగించింది