John Abraham: మీ సినిమాలు అతిగా ఉంటున్నాయ్ సార్.. రిపోర్టర్లపై హీరో సెటైర్లు!

హీరోలకు తెలిసి చేసినా తెలియకుండానే దర్శకుడు చేసినా.. ఒక్కోసారి యాక్షన్ సినిమాలలో మరీ ఎక్కువ చేస్తుంటారు. హీరోలను సూపర్ హీరోలను చేసి చూపే క్రమంలో అసలు ఏ మాత్రం నమ్మశక్యంగాని..

John Abraham: మీ సినిమాలు అతిగా ఉంటున్నాయ్ సార్.. రిపోర్టర్లపై హీరో సెటైర్లు!

John Abraham

John Abraham: హీరోలకు తెలిసి చేసినా తెలియకుండానే దర్శకుడు చేసినా.. ఒక్కోసారి యాక్షన్ సినిమాలలో మరీ ఎక్కువ చేస్తుంటారు. హీరోలను సూపర్ హీరోలను చేసి చూపే క్రమంలో అసలు ఏ మాత్రం నమ్మశక్యంగాని రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్లు కనిపిస్తుంటాయి. తెలుగులో కూడా ఇలాంటి కొన్ని సినిమాలు వస్తే మన ప్రేక్షకులు వాటిని తిప్పుకొట్టిన సందర్భాలున్నాయి. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. ఆ కోవకే చెందింది జాన్ అబ్రహం నటించిన సత్యమేవ జయతే.

Bollywood Directors: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. యంగ్ డైరెక్టర్ల మిస్ ఫైర్!

ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ ఏకంగా జాన్ అబ్రహాంని ప్రశ్నించాడు. దీంతో కోపగించుకున్న హీరో రిపోర్టర్లపై సెటైర్లు వేశాడు. జాన్ నటించిన అటాక్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఓ రిపోర్టర్.. మీ సినిమాల్లో యాక్షన్‌ ఓవర్‌ డోస్ అవుతుంది. మీరు నలుగురైదుగురితో పోరాడుతుంటే బాగుంటుంది. అదే మీరు ఒక్కరే 200 మందితో ఫైట్ చేయడం, బైక్‌లను విసిరేయడం, మీ చేతులతో ఛాపర్‌లను ఆపడం చూస్తే కొంచెం అతిగా అనిపిస్తూ ఉంటుందన్నాడు.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

వెంటనే ఆగ్రహించిన హీరో గారు.. ‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారు’ అని అడిగాడు. ‘సత్యమేవ జయతే’ గురించి సార్ అని రిపోర్టర్ బదులిచ్చాడు. అందుకు జాన్‌ ‘నేను ​ఎటాక్‌ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు దీంతో ఏమైనా సమస్య ఉంటే అడగండి.. ‘నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నిజంగా బాధపెట్టాను.’ అని వెటకారంగా సమాధానమిచ్చాడు జాన్. అంతేకాదు అనంతరం మరో రిపోర్టర్ ఫిట్‌నెస్‌ గురించి అడిగినా.. ‘శారీరకంగా ఫిట్‌గా ఉండటం కంటే కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ప్రయత్నిస్తుంటాని మళ్ళీ అదే సెటైరికల్ ఆన్సర్ ఇచ్చాడు.

Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

అంతేకాదు.. అంతే వెటకారంగానే.. క్షమించండి సార్‌. మీరు మీ మెదడును ఇంట్లో వదిలేసి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుతున్నాను. పర్వాలేదు.. మరోసారి బాగా ప్రయత్నించండి.’ అంటూ వ్యంగంగా మాట్లాడాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నిజాయతీగా అతి తగ్గించుకోవాలని చెప్పిన రిపోర్టర్లపై జాన్ ఇలా మాట్లాడడం పద్ధతి కాదని.. ఒకవైపు సౌత్ సినిమాలు బాలీవుడ్ ను ఆక్రమించుకుంటున్నా.. మీరు ఎందుకు కళ్ళు తెరవలేకపోతున్నారని ఉత్తరాది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.