JP Nadda: చదువుకున్న కాలేజీలోనే జేపీ నడ్డాకు చేదు అనుభవం.. వీడియో

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బిహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. గ‌తంలో తాను చ‌దువుకున్న ప‌ట్నా కాలేజీలో సెమినార్ కోసం వెళ్ళిన‌ జేపీ న‌డ్డాను ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్ (ఏఐఎస్ఏ) కార్య‌క‌ర్త‌లు అడ్డుకుని చుట్టుముట్టారు. వెన‌క్కి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020ను వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

JP Nadda: చదువుకున్న కాలేజీలోనే జేపీ నడ్డాకు చేదు అనుభవం.. వీడియో

JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బిహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. గ‌తంలో తాను చ‌దువుకున్న ప‌ట్నా కాలేజీలో సెమినార్ కోసం వెళ్ళిన‌ జేపీ న‌డ్డాను ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్ (ఏఐఎస్ఏ) కార్య‌క‌ర్త‌లు అడ్డుకుని చుట్టుముట్టారు. వెన‌క్కి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020ను వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అలాగే, ప‌ట్నా విశ్వ‌విద్యాల‌యానికి కేంద్రీయ వర్సిటీ హోదా ఇవ్వాల‌ని నినాదాలు చేశారు.

దీంతో ఏఐఎస్ఏ కార్య‌క‌ర్త‌లను నెట్టేసిన భ‌ద్ర‌తా సిబ్బంది న‌డ్డాను ముందుకు తీసుకెళ్ళారు. బీజేపీ-జేడీయూ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయంటూ ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప‌ట్నా వ‌ర్సిటీకి కేంద్రీయ హోదా ఇవ్వాల‌ని గ‌తంలో బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ కూడా డిమాండ్ చేశారు. బీజేపీ నిర్వ‌హిస్తోన్న రెండు స‌మావేశాల్లో పాల్గొనేందుకు న‌డ్డా ప్ర‌స్తుతం బిహార్‌లో ఉన్నారు. కాగా, నూత‌న‌ విద్యా విధానం వ‌ల్ల ఎంతో న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్ అంటోంది.