Kalyan Ram : అమిగోస్ టీజర్‌కి ముహూర్తం ఖరారు చేసిన కళ్యాణ్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూవీలోని హీరో పాత్రలను ఒకొకటిగా పరిచయం చేసుకుంటూ వస్తున్న చిత్ర యూనిట్.. నేడు మూవీ లాస్ట్ క్యారెక్టర్ మూడో పాత్రని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

Kalyan Ram : అమిగోస్ టీజర్‌కి ముహూర్తం ఖరారు చేసిన కళ్యాణ్ రామ్..

Kalyan Ram announced amigos teaser date

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. మూవీలోని హీరో పాత్రలను ఒకొకటిగా పరిచయం చేసుకుంటూ వస్తున్న చిత్ర యూనిట్.. నేడు మూవీ లాస్ట్ క్యారెక్టర్ మూడో పాత్రని ఇంట్రడ్యూస్ చేశారు.

Kalyan Ram : ‘అమిగోస్’లో త్రిపాత్రాభినయం చేయబోతున్న కళ్యాణ్ రామ్?

ఇప్పటివరకు పరిచయం చేసిన పాత్రలు పేర్లు చెప్పుకొచ్చిన మూవీ టీం.. ఈ మూడో క్యారెక్టర్ ని మాత్రం పేరు చెప్పకుండా అజ్ఞాతవ్యక్తి అంటూ ఇంట్రడ్యూస్ చేశారు. పోస్టర్ లో కళ్యాణ్ రామ్ లుక్ చూస్తుంటే ఇది విలన్ పాత్ర అని తెలుస్తుంది. మొదటి రెండు లుక్‌ల్లో క్లాస్‌గా కనిపించిన కళ్యాణ్ రామ్.. ఈ పాత్రలో మెరిసిన జుట్టు, గడ్డంతో చేతిలో గన్ పట్టుకొని మాస్ లుక్ కనిపిస్తున్నాడు.

అలాగే ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 8న ఉదయం గం.11:07 నిమిషాలకు టీజర్ ని విడుదల చేయనున్నారు. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ నటిస్తుంది. ఫిబ్రవరి 10న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడితో వస్తున్నాడు అంటే అది కచ్చితంగా హిట్టు అవ్వాల్సిందే. మరి ఈ సినిమాతో ‘బింబిసార’ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడా? లేదా? చూడాలి.