Kane Williamson Video: అయ్యయ్యో.. కుడి కాలు కదిలించలేని స్థితిలో సొంత దేశానికి కేన్ విలియమ్సన్

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్ భారత్ నుంచి న్యూజిలాండ్ చేరుకున్నాడు. మీడియా ముందు ఒకే ఒక్క మాట చెప్పాడు.

Kane Williamson Video: అయ్యయ్యో.. కుడి కాలు కదిలించలేని స్థితిలో సొంత దేశానికి కేన్ విలియమ్సన్

Kane Williamson (Pic Credit: Newshub)

Kane Williamson Video: ఐపీఎల్ 2023 (IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) మోకాలి గాయంతో సొంత దేశం న్యూజిలాండ్ చేరాడు. అతడు కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఫొటోలను న్యూజిలాండ్ వార్తా వెబ్ సైట్ Newshub పోస్ట్ చేసింది. 32 ఏళ్ల కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక వాకీ ఎల్బో క్రట్చ్ ల సాయంతో వెళ్తుండడాన్ని ఇందులో మనం చూడొచ్చు.

కేన్ విలియమ్సన్ అభిమానులు ఈ దృశ్యాలు చూసి షాక్ కు గురవుతున్నారు. ఊత కర్రలతో అతడు వెళ్తున్న దృశ్యాలను చూడలేకపోతున్నామని అన్నారు. ఆక్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద న్యూజిలాండ్ మీడియా అతడితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. “ప్రస్తుతమైతే మరీ విపరీతమైన నొప్పి ఏమీ లేదు” అని Newshub మీడియాకు తెలిపాడు. న్యూజిలాండ్ వన్డే కెప్టెన్ గానూ కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు.

అక్టోబరు 5 నుంచి భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. కనీసం అప్పటికైనా అతడు కోలుకుంటాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేన్ విలియమ్సన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతడు చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకుంటేనేగానీ కోలుకునే అవకాశాలు లేవు. న్యూజిలాండ్ లో అతడు మెరుగైన చికిత్స తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కుడి కాలు కదిలించలేని స్థితిలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది.

IPL 2023: ఐపీఎల్ టోర్నీ నుంచి గుజరాత్ టైటాన్స్‌ జట్టు కీలక ప్లేయర్ ఔట్ ..