Bengaluru couple: అర్ధరాత్రి పూట జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నందుకు రూ.1,000 తీసుకున్న పోలీసులు

బెంగళూరులో నివసించే కార్తీక్ పాత్రి అనే తన భార్యతో కలిసి అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న సమయంలో వారివద్దకు పోలీస్ గస్తీ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? వంటి ప్రశ్నలు అడిగి కార్తీక్ దంపతులను పోలీసులు భయపెట్టారు. ఐడీ కార్డులు చూపించాలని పోలీసులు బెదిరించారు.

Bengaluru couple: అర్ధరాత్రి పూట జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నందుకు రూ.1,000 తీసుకున్న పోలీసులు

Bengaluru couple

Bengaluru couple: అర్ధరాత్రి పూట ఓ జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం చూసిన పోలీసులు వారి వద్దకు వెళ్లి, జరిమానా కట్టాలంటూ రూ.1,000 తీసుకున్నారు. రాత్రి సమయంలో పోకిరీల నుంచి పౌరులను కాపాడాల్సిన పోలీసులే ఇలా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుండడం కలకలం రేపింది. ఈ ఘటన బెంగళూరులోని సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దీనిపై విచారణ జరిపిన అధికారులు ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. బెంగళూరులో నివసించే కార్తీక్ పాత్రి అనే తన భార్యతో కలిసి అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న సమయంలో వారివద్దకు పోలీస్ గస్తీ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? వంటి ప్రశ్నలు అడిగి కార్తీక్ దంపతులను పోలీసులు భయపెట్టారు. ఐడీ కార్డులు చూపించాలని బెదిరించారు.

ఈ విషయాన్ని వివరిస్తూ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఆ సమయంలో తమ వద్ద ఫోన్లు, కేక్ బ్యాక్సు తప్ప ఏమీ లేవని చెప్పాడు. అదృష్టవశాత్తూ ఫోనులో ఆధార్ కార్డు ఫొటోలు ఉండడంతో వాటిని పోలీసులకు చూపించామని అన్నాడు. అయినప్పటికీ పోలీసులు తమను అనుమానంతో కూడిన ప్రశ్నలు వేశారని, అలాగే, ఎక్కడ పనిచేస్తారు? మీ తల్లిదండ్రుల పేర్లు ఏమిటీ? అని అడిగారని తెలిపాడు. తాము వారు అడిగిన ప్రశ్నలన్నింటినీ సమాధానం చెప్పామని అన్నాడు.

ఒక పోలీసు చలాను కట్టాలని అన్నాడని, రాత్రి 11 దాటాక రోడ్డుపై తిరగకూడదని చెప్పాడని కార్తీక్ తెలిపాడు. రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పాడు. చివరకు రూ.1,000 తీసుకుని వదిలేశారని తెలిపాడు. ఈ ట్వీట్ చేసిన కాసేపటికే అది వైరల్ అయింది. దీంతో ఆ పోలీసులపై చర్యలు తీసుకున్నామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు వివరించారు.

Viral Video: ఇదెక్కడి చోద్యం?.. ఖాళీ పాత్రలను రెండు చేతులతో పట్టుకుని కొడుతూ పెళ్లిలో డ్యాన్స్