Maa Elections : మంచు విష్ణుకు కోట సపోర్ట్.. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర విమర్శలు

ప్రకాశ్ రాజ్ నటన గురించి వదిలేయండి. నేషనల్ లెవెల్ ఆర్టిస్టునీ... మాకు నందులొచ్చాయి... అవార్డులొచ్చాయని కొందరు చెప్పుకుంటారు. మేం చెప్పుకోం.

Maa Elections : మంచు విష్ణుకు కోట సపోర్ట్.. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర విమర్శలు

Kota Srinivasa Rao

Updated On : October 8, 2021 / 4:01 PM IST

Maa Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హీట్ పీక్స్ కు చేరుకుంటోంది. MAA అధ్యక్ష పదవికి పోటీ దారులైన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తమ మేనిఫెస్టోలను ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు మేనిఫెస్టోలపైనా … ఇండస్ట్రీలోనే కాదు… పొలిటికల్ గానూ హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అక్టోబర్ పదో తేదీన పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నకొద్దీ… ఎవరికి వారు.. వారి మద్దతుదారులతో మాట్లాడిస్తూ… ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు తపన పడుతున్నారు.

Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

అటు ప్రకాశ్ రాజ్… ఇటు మంచు విష్ణు… పోటాపోటీగా.. తమ మద్దతుదారులతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తున్నారు. ఇటీవలే సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు నరేష్ .. మంచు ప్యానెల్ తరఫున మాట్లాడారు. మెగా బ్రదర్ నాగబాబుతో.. ప్రెస్ మీట్ పెట్టించి కౌంటర్ ఇప్పించారు ప్రకాశ్ రాజ్. పోటాపోటీ మద్దతుదారుల ప్రకటనలతో మా ఎన్నికల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది.

తాజాగా మంచు విష్ణుకు సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మద్దతుపలికారు. విష్ణుకు ఓటేసి గెలిపించాలని సభ్యులను కోరారు. మా అధ్యక్షుడిగా ఉండేందుకు మంచు విష్ణుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ప్రకాశ్ రాజ్ పై విమర్శలు చేశారు కోట. ప్రకాశ్ రాజ్ తో తాను 15 సినిమాలు చేశాననీ.. ఐతే.. ఏనాడూ ఆయన షూటింగ్ లకు టైం రాలేదన్నారు.

“మంచు విష్ణుకు ఓటేయాలని అడగాల్సిన అవసరం లేదు. మేం వేస్తాం. ప్రకాశ్ రాజ్ నటన గురించి వదిలేయండి. నేషనల్ లెవెల్ ఆర్టిస్టునీ… మాకు నందులొచ్చాయి… అవార్డులొచ్చాయని కొందరు చెప్పుకుంటారు. మేం చెప్పుకోం. మేం కీలక పాత్రలు వేసి కలిసి చేసిన ఏ సినిమాకు కూడా ప్రకాశ్ రాజ్ టైంకు రాలేదు. లోకల్.. నాన్ లోకల్ అనేది ఇక్కడ అనవసరమైన విషయం. విష్ణుకే మా ఓటు” అని కోట అన్నారు.

అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి.. మ.2గంటల వరకు జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.

Read This : RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?