Kothi Kommacchi : ప్రేమ కల్లు తాగి కోతులన్నీ, ఇల్లే పీకి పందిరేసుకోని.. ‘కోతి కొమ్మచ్చి’..

మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్‌గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోతి కొమ్మచ్చి’..

Kothi Kommacchi : ప్రేమ కల్లు తాగి కోతులన్నీ, ఇల్లే పీకి పందిరేసుకోని.. ‘కోతి కొమ్మచ్చి’..

Kothi Kommacchi Movie Theme Song Released

Kothi Kommacchi: మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్‌గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోతి కొమ్మచ్చి’.. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సరికొత్త పంథాలో 2D యానిమేషన్‌తో థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ యానిమేషన్ వీడియో సాంగ్‌ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసి టీంను అభినందించారు. ‘కో కో కో కోతి కొమ్మచ్చి’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తుంది.

Kothi Kommacchi

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ.. ‘‘మా ‘కోతి కొమ్మచ్చి’ చిత్రం నుండి మొదటిగా థీం సాంగ్ రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ సాంగ్‌ని రిలీజ్ చేసిన మా రాజు గారికి ధన్యవాదాలు. కథలో ఓ మంచి సందర్భంలో వచ్చే ఈ పాటను 2d యానిమేషన్‌లో విడుదల చేస్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాం. అనూప్ ఎనర్జిటిక్ మ్యూజిక్, శ్రీమణి లిరిక్స్ కలిసి ఈ సాంగ్‌ని అందరికీ నచ్చేలా చేశాయి. సినిమాలో ఈ సాంగ్‌కి మా హీరో, హీరోయిన్స్ డ్యాన్స్ చేసినప్పటికీ థీం సాంగ్‌‌లో మాత్రం కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా కోతులతో డ్యాన్స్ చేయించాం. ఇది పిల్లల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మా సినిమాలోని ఓ మంచి పాటతో ప్రమోషన్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సాంగ్ సినిమాలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందని భావిస్తున్నాము. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కి అలాగే చక్కని సాహిత్యం అందించిన శ్రీమణి గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు.

Kothi Kommacchi

అనూప్ రుబెన్స్ మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. సతీష్ గారు కథకు తగ్గట్టు మంచి సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ ఆల్బంలో అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి. అన్ని పాటలు అందరికీ నచ్చుతాయి. ఈ థీమ్ సాంగ్‌ని ఆదరించి మంచి విజయం చేస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.