దెందులూరు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తలపై దాడి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబయ్య చౌదరి, పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ పరామర్శించారు.

Chintamaneni Prabhakar vs Kothari Abbaya
Denduluru Assembly constituency : దెందులూరు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓటు వెయ్యను అన్నందుకు లక్ష్మీపురం పంచాయితీ దిబ్బగూడెంలో చంటిబాబు అనే దళిత యువకుడిపై టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దాడిచేసి, దుర్భాషలాడారని, ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన మరికొంత మందిపైకూడా దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వైసీపీ నేతలు తరలించారు.
Also Read : BRS Foundation Day : గులాబీ పార్టీకి 23ఏళ్లు.. ఈసారి నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబయ్య చౌదరి, పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం వైసీపీ సానుభూతిపరులపై దాడిచేస్తున్నారని ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు అబ్బయ్య చౌదరి తెలిపారు.