Krithi Shetty : బాలీవుడ్ సినిమాలు చేయను.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసే ఆలోచన లేదు

కృతిశెట్టి మాట్లాడుతూ..''నేను చేసే కమర్షియల్ పాత్రల్లో కూడా కొత్తదనం ఉండాలి అనుకుంటున్నాను. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో............

Krithi Shetty : బాలీవుడ్ సినిమాలు చేయను.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసే ఆలోచన లేదు

krithishetty about bollywood movies

Krithi Shetty :  మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ఆ తర్వాత వరసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన కృతికి ఆఫర్స్ బాగానే వచ్చాయి. కానీ ఇటీవల ది వారియర్ సినిమా కృతిని నిరాశ పరిచింది. తాజాగా నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ఆగస్టు 12న రానుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కృతిశెట్టి.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గతంలోనే కమర్షియల్ సినిమాలు చేస్తాను, ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ కి కూడా ఓకే అని చెప్పిన కృతి మరోసారి తాను చేయాలనుకున్న పాత్రలపై క్లారిటీ ఇచ్చింది.

Karthikeya 2 Theatrical Trailer : కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ!

కృతిశెట్టి మాట్లాడుతూ..”నేను చేసే కమర్షియల్ పాత్రల్లో కూడా కొత్తదనం ఉండాలి అనుకుంటున్నాను. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మోడ్రన్‌ క్యారెక్టర్ చేశాను. ‘ఉప్పెన’లో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిగారితో కలిసి నటించాక ఆయనలాగే నటనలో విలక్షణ పాత్రలు చేయాలనే స్ఫూర్తి వచ్చింది. ఇటీవల నేను నటించిన కమర్షియల్‌ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి. సూర్య ‘అచలుడు’, సుధీర్‌ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో డిఫరెంట్ పాత్రాల్లో కనిపిస్తాను”

”బాలీవుడ్‌ సినిమాలు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయను. నా సినిమాల ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించను. నా సినిమాలు చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వాలని భావిస్తాను. త్వరలోనే మరిన్ని సినిమాలతో మీ ముందుకి వస్తాను. భవిష్యత్తులో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి కూడా” అని తెలిపింది. దీంతో బేబమ్మని లేడీ ఓరియెంటెడ్ రోల్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే అని చెప్పొచ్చు. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా ఎప్పుడు బాలీవుడ్ చెక్కేద్దామా అని చూస్తుంటే కృతి అసలు బాలీవుడ్ సినిమాలు చేయను అనడం ఆశ్చర్యమే.