Lava Blaze 5G : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే లావా బ్లేజ్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Lava Blaze 5G : ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా (Lava) నుంచి భారత మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. కేవలం రూ.9,999 ధరకే Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

Lava Blaze 5G : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే లావా బ్లేజ్ 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Lava Blaze 5G, India's most affordable 5G phone launched under Rs 10,000

Lava Blaze 5G : ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా (Lava) నుంచి భారత మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. కేవలం రూ.9,999 ధరకే Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత సరసమైన 5G స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. స్పీడ్ ఇంటర్నెట్ కోరుకునే ఎంట్రీ-లెవల్ యూజర్ల కోసం ఈ కొత్త 5G లావా స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. Lava Blaze 5G ముఖ్య ఫీచర్లలో 4GB RAM, 128GB స్టోరేజీ, 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. లావా బ్లేజ్ 5Gని తొలిసారిగా అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 (IMC)లో కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రదర్శించారు.

లావా బ్లేజ్ 5G ధర ఎంతంటే? :
Lava Blaze 5G ఏకైక 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 9,999 ప్రారంభ ధరను కలిగి ఉందని లావా తెలిపింది. ఈ ప్రారంభ ధర ఎంతకాలం వర్తిస్తుందో కూడా కంపెనీ స్పష్టం చేయలేదు. ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. భారత మార్కెట్లో సేల్ అమెజాన్ ద్వారా ప్రారంభం కానుంది. Lava Blaze 5G కచ్చితమైన సేల్ తేదీ ఇంకా ప్రకటించలేదు.

Lava Blaze 5G, India's most affordable 5G phone launched under Rs 10,000

Lava Blaze 5G, India’s most affordable 5G phone launched under Rs 10,000

లావా బ్లేజ్ 5G స్పెసిఫికేషన్స్ ఇవే :
లావా బ్లేజ్ 5G ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, వాటర్‌డ్రాప్-నాచ్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ ప్రోని పోలి ఉంటుంది. కెమెరా సెన్సార్‌లలో చదరపు కటౌట్ వచ్చింది. వెనుక కెమెరా మాడ్యూల్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్ 5G దిగువన 3.5mm ఆడియో జాక్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.51-అంగుళాల HD+ IPS (720×1,600) డిస్‌ప్లేను కలిగి ఉంది. బాక్స్ వెలుపల Android 12లో రన్ అవుతుంది. ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 700 నుంచి శక్తిని అందిస్తుంది. RAM సామర్థ్యాన్ని పెంచేందుకు స్టోరేజీ ఉపయోగించే 3GB వర్చువల్ RAMకి సపోర్టు అందిస్తుంది. Lava Blaze 5G వెనుకవైపు 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు సెన్సార్లు కూడా ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 8-MP కెమెరా సెన్సార్ ఉంది. డిస్ప్లే HD+ రిజల్యూషన్‌కు సపోర్టు అందించినప్పటికీ ప్రధాన కెమెరా 2K వీడియోలను రికార్డ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. కెమెరా యాప్ బ్యూటీ, HDR, నైట్, పోర్ట్రెయిట్, మాక్రో, AI, Pro, UHD, పనోరమా, స్లో మోషన్, ఫిల్టర్‌లు, GIF, టైమ్‌లాప్స్ QR స్కానర్ వంటి మోడ్‌లతో అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ 5G ఇతర ఫీచర్లలో 5G, 5000mAh బ్యాటరీ, USB-C OTG సపోర్టుతో వచ్చింది. Blaze 5G n77, n78 బ్యాండ్‌లతో సహా 8 5G బ్యాండ్‌లకు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Mastodon : ఎలన్ మస్క్ దెబ్బకు మాస్టోడాన్‌‌కు మారిపోతున్న ట్విట్టర్ యూజర్లు.. ట్విట్టర్‌కు, మాస్టోడాన్‌‌‌కు తేడా ఏంటి? ఎలా ఉపయోగించాలో తెలుసా?