Dhoni : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ధోని.. తలైవా ఫ్యాన్స్‌కి పండగే..

తాజాగా లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎవరినైనా క్రికెటర్ ని యాక్టర్ గా తీసుకుందాం అనుకుంటున్నారా అని అడగగా...........

Dhoni : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ధోని.. తలైవా ఫ్యాన్స్‌కి పండగే..

Lokesh Kanagarajan wants Dhoni to act in his films

Dhoni :  తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజన్ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సాధించాడు. మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి. తమిళ్ లోనే కాకుండా వేరే భాషల్లో కూడా ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇటీవల కమల్ హాసన్ హీరోగా ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో, విక్రమ్ గెస్ట్ అప్పీరెన్స్ లో వచ్చిన విక్రమ్ సినిమా ఓ రేంజ్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ సినిమాల్లాగే లోకేష్ కూడా తన సినిమాల్లో ఒక సినిమాకి ఇంకో సినిమాకి కనెక్టివిటీ పెట్టి, ఒక సినిమాలోని క్యారెక్టర్స్ ఇంకో సినిమాలో కంటిన్యూ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తున్నాడు. తన రాబోయే సినిమాల్లో కూడా ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కొనసాగుతుంది అని చెప్పాడు. ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాకి కనెక్షన్ పెట్టి అందరికి షాకిచ్చాడు. త్వరలో ఖైదీ 2 లేదా విక్రమ్ 2 కూడా రాబోతుంది. ఈ సినిమాలకి పాత సినిమాలకి కూడా కనెక్టివిటీ ఉంటుందని తెలిపాడు.

లోకేష్ ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమా చేయాలి. తాజాగా లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎవరినైనా క్రికెటర్ ని యాక్టర్ గా తీసుకుందాం అనుకుంటున్నారా అని అడగగా.. ధోనిని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తీసుకునే ఆలోచనలో ఉన్నాను. ధోని ఒప్పుకుంటే ఏదో ఒక సినిమాలో కచ్చితంగా ధోనికి క్యారెక్టర్ ఉంటుంది అని తెలిపాడు. దీంతో ధోని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

BiggBoss 6 Day 70 : ఆదివారం మరో ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన నాగ్..

ఇప్పటికే ధోని సినిమాల మీద ప్రేమతో సినిమా నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు తీస్తున్నాడు. మొదటి సినిమా తమిళ్ లోనే చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీం వల్ల ధోని తమిళ్ వాళ్లకి బాగా దగ్గరయ్యాడు. లోకేష్ చెప్పినట్టు ధోని కనుక యాక్ట్ చేస్తే కచ్చితంగా కలక్షన్ల వర్షమే కురుస్తుంది. ఇది నిజంగా జరగాలని ధోని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.