MAA Elections 2021 : నేటితో నామినేషన్ల పర్వానికి తెర..

అక్టోబర్ 1, 2 తేదీలు ‘మా’ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి గడువు..

MAA Elections 2021 : నేటితో నామినేషన్ల పర్వానికి తెర..

Nominations

MAA Elections 2021: అక్టోబర్ 10వ తేది కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి.

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

ఈసారి ‘మా’ అధ్యక్షపదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్ వేశారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రెస్ మీట్స్‌లో పోటా పోటీగా మాట్లాడారు.

MAA Elections 2021 : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

ఇక ఈ రోజుతో ‘మా’ ఎన్నికల నామినేషన్‌ల పర్వం ముగియనుంది. రేపు నామినేషన్‌లను పరిశీలిస్తారు. అక్టోబర్ 1, 2 తేదీలు నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి గడువు. మంచు విష్ణు ప్యానెల్ అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు పోటాపోటీగా ప్రచారం చేశారు. తన మేనిఫెస్టో మీద పూర్తి నమ్మకం ఉందని.. అది చూసి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా తనకే ఓటేస్తారని ధీమాగా చెప్తున్నాడు మంచు విష్ణు.

Love Story : అందుకే వైష్ణవ్ తేజ్ వద్దన్నాడా..?