MAA Elections: “మా” ఎన్నికల తుది ఫలితాలు విడుదల

ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రకటించారు.

MAA Elections: “మా” ఎన్నికల తుది ఫలితాలు విడుదల

Maa

Updated On : October 11, 2021 / 7:35 PM IST

MAA Elections 2021: ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రకటించారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌పై గెలిచినట్లుగా ప్రకటించారు. నూతన కార్యవర్గానికి ఎన్నికైన విజేతలను అధికారికంగా ప్రకటించారు కృష్ణమోహన్.

మంచు విష్ణు ప్యానల్‌ నుంచి గెలిచిన ఆఫీస్‌ బేరర్లు:
వైస్‌ ప్రెసిడెంట్‌గా మాదల రవి విజయం
జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు విజయం
ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం
జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు విజయం

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన ఆఫీస్‌ బేరర్లు:
జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌ విజయం
వైస్‌ ప్రెసిడెంట్‌గా బెనర్జీ విజయం
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌ విజయం

ఈసీ సభ్యులు:

శివారెడ్డి, గీతాసింగ్, అశోక్ కుమార్, బ్రహ్మాజి, శ్రీలక్ష్మి, మాణిక్ , ప్రభాకర్ , తనీష్ , ఘర్షణ శ్రీనివాస్ , హరినాథ్ బాబు, సురేష్ కొండేటి, శివన్నారాయణ, సంపూర్ణేశ్ బాబు, శశాంక్ , సమీర్ , సుడిగాలి సుధీర్ ,బొప్పన విష్ణు, కౌశిక్