Maharashtra: బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మ‌ధ్య తాత్కాలిక ఒప్పందం జ‌రిగింది.. అంతే: సంజ‌య్ రౌత్

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే బ‌ల‌పరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేప‌థ్యంలో శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే మ‌ధ్య తాత్కాలిక ఒప్పందం మాత్ర‌మే జ‌రిగింద‌ని, వారు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కి వెళ్ళే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు.

Maharashtra: బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మ‌ధ్య తాత్కాలిక ఒప్పందం జ‌రిగింది.. అంతే: సంజ‌య్ రౌత్

Shiv Sena Mp Sanjay Raut

Maharashtra: మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే బ‌ల‌పరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేప‌థ్యంలో శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే మ‌ధ్య తాత్కాలిక ఒప్పందం మాత్ర‌మే జ‌రిగింద‌ని, వారు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కి వెళ్ళే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. శివ‌సేన‌లో ఉన్న స‌మ‌యంలో ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం ఎమ్మెల్యేలు సింహాల్లా ఉండేవార‌ని అన్నారు. ఇప్పుడు వారు ముంబైకి వ‌చ్చిన స‌మ‌యంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ వ‌చ్చార‌ని చెప్పారు. గ‌తంలో ఉగ్ర‌వాది క‌స‌బ్‌కు కూడా కేంద్ర ప్ర‌భుత్వం అంత‌గా భ‌ద్ర‌త క‌ల్పించలేద‌ని ఆయ‌న అన్నారు. వారు దేని గురించి భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Modi: కాసేప‌ట్లో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. ప్రధానితో క‌లిసి అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొననున్న జగన్

మ‌రోవైపు, ఇవాళ ఏక్‌నాథ్ షిండే బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కోనున్న నేప‌థ్యంలో శివ‌సేన శాస‌న‌స‌భా ప‌క్ష నేత హోదా నుంచి ఎమ్మెల్యే అశోక్ చౌద‌రిని తొల‌గిస్తూ మ‌హారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీక‌ర్ రాహుల్ న‌ర్వేక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. శివ‌సేన‌ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఏక్‌నాథ్ షిండేను నియ‌మించారు. బీజేపీ సాయంతో షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతున్నారు.