Sarkaru Vaari Paata First Notice : ఈసారి పాట ‘మోత మోగిపోద్దమ్మా’..

మహేష్ సరికొత్త గెటప్, స్టైలిష్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు..

Sarkaru Vaari Paata First Notice : ఈసారి పాట ‘మోత మోగిపోద్దమ్మా’..

Sarkaru Vaari Paata First Notice

Updated On : July 31, 2021 / 4:29 PM IST

Sarkaru Vaari Paata First Notice: సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. ‘సర్కారు వారి పాట’.. పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా కీర్తి సురేష్ ఫస్ట్ టైం మహేష్ పక్కన యాక్ట్ చేస్తోంది.

Sarkaru Vaari Paata : ఆడియోతోనే అదిరిపోయే రికార్డ్..!

సూపర్‌స్టార్ పుట్టినరోజుకి పది రోజుల ముందుగానే ‘సర్కారు వారి పాట’ ఫెస్ట్ స్టార్ట్ చేసేశారు. శనివారం సాయంత్రం ‘సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్’ రిలీజ్ చేశారు. మహేష్ సరికొత్త గెటప్, స్టైలిష్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. రిలీజ్ డేట్‌తో వదిలిన పోస్టర్లో మహేష్ మరింత యంగ్‌గా కనిపించారు. ఆగస్టు 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ‘సూపర్‌‌స్టార్ బర్త్‌డే బ్లాస్ట్’ పేరుతో ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్నామని చెప్పారు మేకర్స్.

గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో ‘బొమ్మదద్దరిల్లిపోద్దమ్మా’.. అంటూ బ్లాక్‌బస్టర్ కొట్టిన మహేష్ వచ్చే ఏడాది పెద్ద పండక్కి ‘సర్కారు వారి పాట’ మోత మోగిపోద్దంటున్నారు. యంగ్ మ్యూజిక సెన్సేషన్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా..మహేష్ కెరీర్‌లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతూ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13 భారీస్థాయిలో రిలీజ్ కానుంది ‘సర్కారు వారి పాట’.