Traffic Challan: కేరళలో వింత ఫైన్.. వాహనంలో పెట్రోల్ సరిపడా లేదని రూ. 250 చలానా..

ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎప్పుడు విధిస్తారు..? హెల్మెంట్ ధరించనందుకు, రాంగ్ రూట్ లో వెళ్లినందుకు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్‌లైట్ పడినా ఆగకుండా వెళ్లినందుకు.. ఇంతేనా.. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నా.. ఇప్పుడు నేను చెప్పే చలాన్ మాత్రం మీరు ఎప్పుడూ విని ఉండరు.

Traffic Challan: కేరళలో వింత ఫైన్.. వాహనంలో పెట్రోల్ సరిపడా లేదని రూ. 250 చలానా..

Chalana

Traffic Challan: ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎప్పుడు విధిస్తారు..? హెల్మెంట్ ధరించనందుకు, రాంగ్ రూట్ లో వెళ్లినందుకు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్‌లైట్ పడినా ఆగకుండా వెళ్లినందుకు.. ఇంతేనా.. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నా.. ఇప్పుడు నేను చెప్పే చలాన్ మాత్రం మీరు ఎప్పుడూ విని ఉండరు. ఈ వింత చలాన్ ను కేరళ ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడికి విధించారు. అదేంటంటే.. బైక్ లో సరిపడా పెట్రోల్ లేనందుకు. అవును.. కేరళ రాష్ట్రంలోని ఓ కానిస్టేబుల్ బైక్ లో సరిపడా ఇంధనం లేనందుకు రూ. 250 చలాన్ విధించాడు. ఇందుకు సంబంధించిన ఈ-చలానాను సందరు వాహనదారుడు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రాఫిక్ పోలీసుల తీరుపై సెటైర్లు వేస్తున్నారు.

Traffic Challan : బైక్ పై 88 చలాన్లు, రూ.28 వేల జరిమానా

వాహనదారుడు ఐటీ ఉద్యోగి బాసిల్ శ్యామ్. తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఓ ప్రాంతంలో వన్ వేలో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ ఆపి రూ. 250 చలాన్ విధించారు. తన ఆఫీస్ కు వెళ్లిన తరువాత ఈ-చలానాలో ఏముందోనని చూశాడు. దీంతో శ్యామ్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వాహనంలో ఇంధనం లేకుండా ప్రయాణికులతో వెళ్తున్న నేరానికి జరిమానా అని ఆ రసీదులో ఉంది. దీన్ని అతడు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

Richest Woman: దేశంలో 100మంది సంపన్న మహిళల జాబితా విడుదల.. హైదరాబాద్ నుంచి 12 మంది

కేరళ రవాణా చట్టంలోని నిబంధనల ప్రకారం.. వాణిజ్య వాహనాలు, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే కారు, బస్సు, ఆటో వంటి వాహనాలు ఇంధనం లేకుండా ఆగిపోతే డ్రైవర్, యాజమానికి రూ. 250 జరిమానా విధించే అవకాశం మాత్రం ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీస్.. రాంగ్ రూట్ అని నమోదు చేయకుండా పొరపాటున ఇంధనం తక్కువగా ఉందని చలానా విధిస్తున్నట్లు పేర్కొని ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీస్ విధించిన వింత జరిమానా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.