Traffic Challan : బైక్ పై 88 చలాన్లు, రూ.28 వేల జరిమానా

బుధవారం ట్రాఫిక్ పోలీసులు అఫ్జల్ గంజ్ లో వాహన తనిఖీలు చేస్తుండగా అటుగా ఓ బైక్ వచ్చింది. దానిని ఆపిన పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా, 88 చలాన్లు ఉన్నట్టు తేలింది.

Traffic Challan : బైక్ పై 88 చలాన్లు, రూ.28 వేల జరిమానా

Traffic Challan

Traffic Challan : బుధవారం ట్రాఫిక్ పోలీసులు అఫ్జల్ గంజ్ లో వాహన తనిఖీలు చేస్తుండగా అటుగా ఓ బైక్ వచ్చింది. దానిని ఆపిన పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా, 88 చలాన్లు ఉన్నట్టు తేలింది. ఆ లిస్ట్ ప్రింట్ బయటకు తీయడానికి ఐదు నిమిషాలు పట్టింది. ఒక బండిపై ఎన్ని చలాన్లు చూసి అధికారులు కంగుతిన్నారు. ఇక 88 చలాన్లకు గాను రూ.28,110 చెల్లించాల్సి ఉంది.

బైక్ ఓనర్ ఇప్పుడు తన వల్లకాదనడంతో పోలీసులు వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వాహనంపై నెంబర్‌ప్లేట్స్‌ టాంపరింగ్‌ స్టిక్కర్స్‌ పెట్టడంలాంటి దానిపై మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం చీటింగ్‌ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమార్‌ హెచ్చరించారు. ఇక ఇందులో హెల్మెంట్ లేని చలాన్లతోపాటు, రంగ్ రూట్ వి ఉన్నట్లు తెలిపారు పోలీసులు.

ఇదిలా ఉంటే జులై నెలలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. స్కూటీ ఆపి తనిఖీ చేయగా దానిపై 130 చలాన్లు ఉన్నాయి. జరిమానా రూ. 35 వేలకు పైనే ఉంది. దీంతో స్కూటీ యజమాని దానిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.