Richest Woman: దేశంలో 100మంది సంపన్న మహిళల జాబితా విడుదల.. హైదరాబాద్ నుంచి 12 మంది

భారత దేశంలో 100 మంది అత్యంత సంపద కలిగిన మహిళల జాబితాను కోటక్ వెల్త్ - హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసింది. ధనిక మహిళల్లో మొదటి 100 మంది మొత్తం ఆస్తుల విలువ రూ.4.16లక్షల కోట్లు ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

Richest Woman: దేశంలో 100మంది సంపన్న మహిళల జాబితా విడుదల.. హైదరాబాద్ నుంచి 12 మంది

Richest Women In India

Richest Woman: భారత దేశంలో 100 మంది అత్యంత సంపద కలిగిన మహిళల జాబితాను కోటక్ వెల్త్ – హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసింది. ధనిక మహిళల్లో మొదటి 100 మంది మొత్తం ఆస్తుల విలువ రూ.4.16లక్షల కోట్లు ఉంటుందని నివేదిక అంచనా వేసింది. 2020తో పోలిస్తే వీరి ఆస్తుల విలువ 53శాతం పెరగడం గమనార్హం. అయితే నివేదిక ప్రకారం.. 100మంది సంపన్న మహిళల జాబితా హైదరాబాద్ కు చెందిన వారు 12 మంది ఉండటం గమనార్హం.

Indian Richest women: భారతీయ మహిళల్లో.. ధనవంతులు వీరే..!

తాజాగా విడుదలైన జాబితా ప్రకారం.. ప్రథమ స్థానంలో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. ఆమె నికర సంపద రూ.84,300 కోట్లుగా కోటక్ వెల్త్ – హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. రెండవ స్థానంలో నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ నిలిచారు. ఫల్గుణీ నాయర్ నికర సంపద రూ. 57,520 కోట్లు. ఇక మూడవ స్థానంలో బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా నిలిచారు. ఆమె సంపద విలువ రూ. 29,030 కోట్లుగా నివేదిక పేర్కొంది.

DGCA Shock SpiceJet : స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్‌..50 శాతం విమానాలే నడపాలని ఆదేశం

సంపన్న మహిళల జాబితాలో హైదరాబాద్ కు చెందిన 12 మంది ఉన్నట్లు కోటక్ వెల్త్ – హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయితే దేశంలో ఎక్కువగా ఢిల్లీ నుంచి 25 మంది సంపన్న మహిళలు ఉండగా, తరువాత స్థానంలో ముంబయి (21మంది) నిలిచింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. దివీస్ లాబోరేటరీస్ డైరెక్టర్ నీలిమా మోటపర్తి ఈ 12మందిలో మొదటి స్థానంలో నిలిచింది. ఆమె సంపద రూ. 28,180 కోట్లు, తర్వాతి స్థానంలో బయోలాజికల్ ఇ. లిమిటెడ్ ఎండీ మహిమా  దాట్ల రూ. 5,530 కోట్లతో నిలిచింది. వీరి తరువాతి స్థానంలో రూ. 2,740 కోట్లతో శోభ కామినేని నిలిచారు. భారత్ బయోటెక్ ఎండీ సుచిత ఎల్లా, అపోలో సింధూరీ హోటల్స్ నుంచి సుచరిత, పి. రెడ్డి ఈ టాప్ 100 సంపన్న మహిళ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు.