Manchu Vishnu: రాజీనామా చేస్తే నీ ఇంటికొచ్చి కొరికేస్తా..!!

మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో గెలచిన మంచు విష్ణు.. ఎన్నికల తర్వాత 'మా' సభ్యులు అంతా ఒకటేనని, ప్రతీ ఒక్కరిని కలుపుకుని పోతానని ప్రకటించారు.

Manchu Vishnu: రాజీనామా చేస్తే నీ ఇంటికొచ్చి కొరికేస్తా..!!

Manchu Vishnu Press Meet On Maa Elections

Updated On : October 11, 2021 / 8:54 PM IST

Manchu Vishnu: మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో గెలచిన మంచు విష్ణు.. ఎన్నికల తర్వాత ‘మా’ సభ్యులు అంతా ఒకటేనని, ప్రతీ ఒక్కరిని కలుపుకుని పోతానని ప్రకటించారు.

ఈ క్రమంలోనే రాజీనామా చేసిన నాగబాబు, ప్రకాష్ రాజ్‌ని కూడా రాజీనామాలను వెనక్కి తీసుకునేలా చేస్తానని అన్నారు మంచు విష్ణు. మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించారు మంచు విష్ణు.

“రాజీనామా చేస్తున్నట్లు నాకు లెటర్ పెట్టారంటే మాత్రం నేను వెళ్లి శివాజీరాజాను కొరికేస్తాను.” ఆయన అటువంటి నిర్ణయం తీసుకోరు అని నమ్మకంగా చెప్పారు. అయితే, శివాజీరాజా మాత్రం కొన్ని డిమాండ్‌లు విష్ణు ముందు ఉంచుతున్నారు.

ఇక నాగ‌బాబు ఆవేశంతో ‘మా’ ప్రాథ‌మిక స‌భ్య‌త్వ‌ రాజీనామా చేశారని, కానీ నాగబాబు రాజీనామాను ఆమోదించ‌మ‌న్నారు విష్ణు. భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని న‌డుచుకుంటాన‌ని, ప్ర‌మాణ స్వీకారంపై రేపు స్ప‌ష్ట‌త ఇస్తానన్నారు విష్ణు.