Telangana : ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ప్రియాంకాగాంధీ తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు

దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రియాంకా గాంధీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోపక్క మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలో పర్యటిస్తున్నారు. కేటీఆర్ పర్యటన క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేేస్తున్నారు.

Telangana :  ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ప్రియాంకాగాంధీ తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు

Priyanka gandhi's Telangana tour

Telangana : ఈరోజు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తెలంగాణలోపర్యటిస్తున్నారు. మరోపక్క మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలో పర్యటిస్తున్నారు.దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రియాంకా గాంధీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ”యువ సంఘర్షణ సభ” పేరుతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతున్నారు. ప్రియాంకా గాంధీ పొలిటికల్ టూర్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రియాంక గాంధీ పొలిటికల్ టూర్ ని ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకుంటే బాగుంటుందని..పదేళ్లుగా అధికారం లేకపోవటంతో కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ లో ఉంది అంటూ సెటైర్లు వేశారు.

తెలంగాణలో పరిపాలన తమ పరిపాలనా విధానాలను… ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలని సూచించారు. మా పాలనలో ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు..అదే ప్రైవేటు సంస్థల్లో 22లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని అన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీ ఒకటి ఉంటే దేశంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండేదే కాదని అన్నారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ క్షమాపణల చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే సీపీసీ పదవి ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. అలాగే ప్రియాంకా పొలిటికల్ టూర్ పై సెటైర్లు వేస్తు పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందన్నారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ ని ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకోవాలని..బీఆర్ఎస్ పాలనలో అమలు చేసే పరిపాలన విధానాలను… ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలని సూచించారు.

అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు యువతకు ముందుగా క్షమాపణ చెప్పాలని..తెలంగాణ ఇవ్వకుండా ఎంతోమంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించుకున్నాక సాగునీటి ప్రాజెక్టులో తెలంగాణను సస్యశ్యామలంగా చేసుకున్నామని..కానీ ప్రాజెక్టులు కడుతుంటే తప్పుడు కేసులు వేసి అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస నేతలు ఎన్నో ఇబ్బందులు పెట్టారని కానీ వాటన్నింటిని ఎదుర్కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని ఈ విషయాన్ని ప్రియాంకా తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలని సూచించారు.

కాగా కాంగ్రెస్ సరూర్‌నగర్‌ స్టేడియంలో 8న నిర్వహించే ‘యువ సంఘర్షణ సభ’ విజయవంతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. యువ సంఘర్షణ సభ విజయంతం కోసం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఆఫైర్స్‌ కమిటీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయులతోనూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రేలు సమావేశం నిర్వహించి.. జన సమీకరణలో ప్రతి నాయకుడు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఈ సభకు హాజరవ్వటానికి ప్రియాంకా గాంధీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. మరోపక్క కేటీఆర్ బెల్లంపల్లిలో పర్యటించనున్నారు. ఇళ్లపట్టాల పంపిణీ చేయనున్నారు.దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలుమండిపడుతున్నారు.