Modi Birthday : మోదీ బహుమతులు, జ్ఞాపికలు కావాలా ?

ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది.

Modi Birthday : మోదీ బహుమతులు, జ్ఞాపికలు కావాలా ?

Modi

Modi Birthday : భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే. 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మోదీ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు రెడీ అయ్యింది బీజేపీ. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, నదులను శుభ్రం చేసే కార్యక్రమాలు, రేషన్‌ కార్డుల పంపిణీతోపాటు మరికొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాలు 20 రోజులపాటు నిర్వహించనున్నారు. సేవా ఔర్‌ సమర్పణ్‌ అభియాన్‌ పేరుతో బీజేపీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Read More : PM Modi : హ్యాపీ బర్త్ డే మోదీజీ, బీజేపీ సంబరాలు..71 వేల దీపాలతో శుభాకాంక్షలు

ఈ మెగా కార్యక్రమం అక్టోబర్‌ 7న ముగుస్తుంది. మోదీ బర్త్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే సంబరాలు స్టార్టయ్యాయి. బేజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు కొట్టారు.  పలుచోట్ల భారీ కేక్‌లను సైతం కట్‌ చేశారు. ఇక.. ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిలో సంబరాలు అంబరాన్నంటాయి. భారత్ మాతా ఆలయం దగ్గర 71వేల దీపాలను వెలిగించారు. 71 కిలోల లడ్డూను కట్ చేశారు.

Read More : PM Modi: “పీఎం మోదీ పంపారు.. డబ్బులు తిరిగిచ్చేదే లేదు”

ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది. వేలం ద్వారా వచ్చిన డబ్బును గంగానదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన నమామీ గంగ మిషన్‌కు వినియోగిస్తామని పేర్కొంది. వేలం జాబితాలో అయోధ్య రామమందిరం, చార్‌ధామ్‌, రుద్రాక్ష్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నమూనాలు, ఒలింపిక్స్‌ విజేతల సామగ్రి, పెయింటింగ్స్‌ ఉన్నట్టు వెల్లడించింది. ఆసక్తిగల వారు సెప్టెంబర్‌ 17-అక్టోబర్‌ 7 మధ్య ఈ-వేలంలో పాల్గొనవచ్చని చెప్పింది.