Moto Watch 100 : మోటరోలా కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది… ఫీచర్లు ఇవేనా?

ప్రముఖ మోటరోలా కంపెనీ నుంచి కొత్త బ్రాండ్ స్మార్ట్ వాచ్ వస్తోంది. మోటో వాచ్ 100 పేరుతో మార్కెట్లో త్వరలో లాంచ్ కాబోతోంది. కెనడా కంపెనీ CE Bands.inc భాగస్వామ్యంలో రానుంది.

Moto Watch 100 : మోటరోలా కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది… ఫీచర్లు ఇవేనా?

Moto Watch 100 Specifications Surface; Tipped To Feature Round Display, Heart Rate Sensor (1)

Moto Watch 100 SmartWatch : ప్రముఖ మోటరోలా కంపెనీ నుంచి కొత్త బ్రాండ్ స్మార్ట్ వాచ్ వస్తోంది. మోటో వాచ్ 100 పేరుతో మార్కెట్లో త్వరలో లాంచ్ కాబోతోంది. కెనడా కంపెనీ CE Bands.inc భాగస్వామ్యంలో ఈ కొత్త స్మార్ట్ వాచ్ తీసుకొస్తోంది మోటో. మోటరోలా కొత్త స్మార్ట్ వాచ్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫీచర్లను CE Brands రివీల్ చేసినట్టు తెలుస్తోంది. FCCలో ఈ కొత్త స్మార్ట్ వాచ్ ఫీచర్లకు సంబంధించి వివరాలను లిస్టు చేసింది. Moto Watch 100 స్పెషిఫికేషన్లు, ఫీచర్ల వివరాలను కూడా అందించింది. స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా స్మార్ట్ వాచ్ సిగ్మెంట్లలోనూ మోటరోలా తమ మార్కెట్ విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.

అందులో భాగంగానే మోటో బ్రాండ్ స్మార్ట్ వాచ్ రిలీజ్ చేస్తోంది. Kodak Baby Monitors, Air Purifiers, Motorola సంయుక్తంగా మోటరోలా ఎంట్రీ లెవల్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ స్మార్ట్ వాచ్ Moto Watch 100కు సంబంధించి కంపెనీ మోటరోలా, CE Brands అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేయనుందో రివీల్ చేయలేదు. కానీ, స్మార్ట్ వాచ్ డిజైన్ ఎలా ఉంటుందో మాత్రం సీఈ బ్రాండ్స్ ఆపరేషనల్ అప్ డేట్ రిలీజ్ అయింది. రాబోయే ఈ కొత్త స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
Diwali with Mi sale: దీపావళి Mi సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు

అందులో సర్కుల్యర్ డిస్‌ప్లే, డివైజ్ కుడివైపు భాగంలో రెండు క్రౌన్ బటన్స్ కూడా ఉన్నాయి. అలాగే అల్యూమినియం కేసు కూడా ఉంది. మిగతా ఫీచర్లలో వివిధ సెన్సార్లు ఉండగా.. అందులో హార్ట్ రేట్ సెన్సార్, ఇతర ముఖ్యమైన సెన్సార్లలో ఆక్సిజన్ లెవల్ సెన్సార్ కూడా ఉంది. 355mAh బ్యాటరీ సామర్థ్యంతో స్మార్ట్ వాచ్ రన్ అవుతుంది. ఈ డివైజ్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అందులో Phantom Black, Steel Silver కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ స్మార్ట్ వాచ్ Moto 360 WearOS సాఫ్ట్ వేర్ రన్ అవుతుంది.

Hidden Charges: హిడెన్ ఛార్జీల పేరుతో రూ.9వేల 700కోట్ల బ్యాంకు దోపిడీ